EPAPER

Ajay Jadeja Jamnagar: ఆ రాజ్యానికి వారసుడిగా క్రికెటర్ అజయ్ జడేజా.. అధికారికంగా ప్రకటించిన రాజుగారు

Ajay Jadeja Jamnagar: ఆ రాజ్యానికి వారసుడిగా క్రికెటర్ అజయ్ జడేజా.. అధికారికంగా ప్రకటించిన రాజుగారు

Ajay Jadeja Jamnagar| మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఓ రాజ్యానికి రాజు కాబోతున్నాడు. ఈ మేరకు ఆ రాజ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. గుజరాత్ లోని జామ్‌నగర్ రాజ్యానికి రాజు మహారాజ శత్రుశల్యసింగ్ జీ దిగ్విజయ్‌సింగ్ జీ శుక్రవారం అక్టోబర్ 11, 2024 రాత్రి ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. తన రాజ కుటుంబానికి వారుసునిగా అజయ్ జడేజాని ఖరారు చేస్తున్నట్లు మహారాజ శత్రుశల్యసింగ్ తెలిపారు. అజయ్ జడేజా జామ్ నగర్ రాజ వంశానికి చెందిన వాడు. ఆయన రాజకుటుంబీకుడైనా సాధారణ జీవనశైలిని ఇష్టపడతారు.


మహారాజ శత్రుశల్యసింగ్ జీ అధికారికంగా ప్రకటిస్తూ.. “ఈ రోజు దసరా. చాలా మంచి రోజు. అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన పాండవులు తమ జీవితాల్లో విజయం సాధించిన రోజు. నా వారసునిగా ఉండేందుకు అజయ్ జడేజా అంగీకరించినందుకు నేను కూడా విజయం సాధించినంత ఆనందంగా ఉంది. జామ్ నగర్ నవానగర్ కి తదపది జామ్‌సాహెబ్ రాజుగా అందరి ముందు అజయ్ జడేజాని ప్రకటిస్తున్నాను. జడేజా నా వారసత్వాన్ని అంగీకరించడం జామ్ నగర్ ప్రజలు చేసుకున్న అదృష్టం. జామ్ నగర్ పాలనా బాధ్యతలు అజయ్ జడేజా సమర్థవంతంగా నిర్వహిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. అజయ్ నీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని రాజుగారు సంతోషం వ్యక్తం చేస్తూ అన్నారు.

అజయ్ జడేజా తండ్రి దౌలత్ సింగ్ జీ ప్రతాప్ సింగ్ జీ జడేజా రాజకుటుంబానికి చెందినవారు. ఆయన ప్రస్తుత మహారాజు శత్రుశల్యసింగ్ జీకి సోదరుడు. అజయ్ జడేజా తండ్రి దౌలత్ సింగ్ జీ మూడు సార్లు జామ్ నగర్ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే జడేజా తండ్రి దౌలత్ సింగ్ జీ కేరళకు చెందిన యువతిని పెళ్లిచేసుకున్నారు .అలా అజయ్ జడేజా గుజరాత్, కేరళ సంప్రదాయలకు చెందినవాడు. అజయ్ జడేజా ప్రస్తుత జామ్ నగర్ రాజు మహారాజ శత్రుశల్య సింగ్ జీకి చాలా సన్నిహితంగా ఉంటారు.


Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

మరోవైపు జామ్ నగర్ రాజ్యానికి మంచి క్రికెట్ చరిత్ర ఉంది. ఇండియన్ క్రికెట్ లో ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లు ఈ రాజ్యం తరపునే నిర్వహిస్తారు. జామ్ నగర్ రాజ కుటుంబానికి చెందిన మహారాజ్ రంజీత్ సింగ్ జీ, మహారాజ్ దులీస్ సింగ్ జీ పేర్లపైనే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రీఫీ టోర్నమెంట్లు ప్రారంభించబడ్డాయి.

ఇక అజయ్ జడేజా క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఆయన 1992 నుంచి 2000 సంవత్సరం వరకు టీమిండియాలో కీలక ఆటగాడి పాత్ర పోషించారు. తన 9 సంవత్సరా జాతీయ క్రికెట్ కెరీర్ లో జడేజా మొత్తం 15 టెస్టు మ్యాచ్ లు, 196 వన్డే మ్యాచ్ ల ఆడారు. అజయ్ జడేజా కెరీర్ లో ఐకానిక్ మ్యాచ్ 1996లో పాకిస్తాన్ పై విజయం సాధించడం.బెంగుళూరులో 1996 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ లో భారత్, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియా కష్టాల్లో ఉండగా.. అజయ్ జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు బాదాడు. ఇందులో 40 పరుగులు చివరి రెండు ఓవర్ల నుంచి మాత్రమే రాబట్టడం విశేషం. ఆ రెండు ఓవర్లు అప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న పాకిస్తాన్ బౌలర్ వకార్ యూనిస్ వేశాడు. అజయ్ జడేజా అద్భుత ఆటతీరుతో ఇండియా ఆ మ్యాచ్ గెలిచింది.

Also Read: సాలరీ రూ.20 లక్షలు.. కక్కుర్తిపడి జంతువుల ఆహారం దొంగతనం చేసేవాడు!

అజయ్ జడేజా బ్యాటింగ్ తో పాటు అద్భుతంగా ఫీల్డింగ్ చేసేవాడు. ఆయన క్రికెట్ కెరీర్ అర్థంతరంగా ముగిసినా.. జడేజా మాత్రం 2023 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. 2023 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ కీలక మ్యాచ్ లలో విజయం సాధించింది.

Related News

Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!

Ind vs Ban: ఇవాళ హైదరాబాద్ లో మూడో టి20.. తెలుగు ప్లేయర్లకు అవకాశం!

Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‍‌కు DSP పోస్ట్..!

IPL 2025: కోహ్లీకి షాక్‌ తప్పదా…RCB రిటెన్షన్ లిస్ట్ ఇదే!

Rohit Sharma – Devara: BGM దేవరది..బ్యాటింగ్‌ రోహిత్‌ శర్మది..ఇక రచ్చ రచ్చే !

IND VS BAN: హైదరాబాద్ గడ్డపై టీమిండియా…రేపే బంగ్లాతో మ్యాచ్

Big Stories

×