EPAPER

Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

Jagan INDIA Bloc| మాజీ సీఎం జగన్ కొత్తగా బ్యాలెట్ పేపర్ నినాదం ఎత్తుకున్నారు … ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్ల పద్దతి ఫాలో అవ్వాలని కోరుతున్నారు… తాను గెలిచినప్పుడు ఈవీఎంల పనితీరును అద్భుతంగా కొనియాడిన ఆయన .. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా బ్యాలెట్ పేపర్ డిమాండ్ వినిపిస్తూ.. మిగిలిన పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది … అయితే జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు 2019 లో ఏం మాట్లాడరంటూ అదిరి పోయే కౌంటర్ ఇచ్చారు … అసలు అప్పుడు ఏం అన్నారు?… ఇప్పుడు సడన్‌గా వాయిస్ ఎందుకు మార్చారు?


హరియాణా ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ విజయం నమోదు చేసింది మొత్తం 90 సీట్లలో 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది … కౌంటింగ్‌ ప్రారంభంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. 37 స్థానాలకే పరిమతమైంది. అయితే, ఈ ఫలితాలపై కాంగ్రెస్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా పలు ఆరోపణలు చేస్తున్నారు.. ఇండియా కూటమికి దగ్గరవ్వాలని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం కాంగ్రెస్‌తో గొంతు కలుపుతున్నారు … తాను గెలిచినప్పుడు ఈవీఎంల పనితీరును కొనియాడుతూ తెగ స్పీచ్‌లు ఇచ్చారు మాజీ సీఎం .

ఇప్పుడు అదే జగన్ మళ్లీ పల్లవి మార్చారు. ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్ పద్దతి ఫాలో అవ్వాలని గళం విప్పారు. ఇన్ డైరెక్ట్ గా ఈవీఎంల వ్యవహారంలో అనుమానాలను బయటపెడుతూ.. పలు పార్టీలను సైతం మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు … పలు దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ పద్దతిని కొనసాగిస్తున్నారని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడిపోయినప్పుడు ఒకలా.. మాట మార్చడం జగన్ కు అలవాటే అంటూ కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నేతల డైలాగ్ వార్ తో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.


Also Read: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

హర్యానా ఎన్నికల ఫలితాలపై జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి… ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు జగన్‌. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని. మనలాంటి ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని ట్వీట్ చేశారు.

అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారని జగన్ తన సుదీర్ఘ ట్వీట్లో బోల్డు ఉదాహరణలు కూడా పేర్కొన్నారు …. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు.. పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయని చెప్పుకొచ్చారు .. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్లకే వెళ్లటం మంచిదని అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుందంట… ఇదే జగన్ తాను గెలిచినప్పుడు ఈవీఎంల గొప్పతనాన్ని… వీవీ ప్యాడ్‌ల గురించి, మాక్ పోలింగ్ అంటూ ఎంతో గొప్పగా వివరించారు.

అప్పట్లో చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారని విమర్శలు చేసిన జగన్ … ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల పల్లవి ఎత్తుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది … జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యల‌పై సీఎం చంద్రబాబు నేరుగా రియాక్ట్ అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన‌ప్పుడు.. ఇలా ఎందుకు డిమాండ్ చేయ‌లేద‌ని ప్రశ్నించారు. 2019లో ప్రజాభిప్రాయం ప్రకార‌మే ఫ‌లితం వ‌చ్చిందా? అని నిల‌దీశారు. చెత్త మాట‌లు మాట్లాడ‌డానికి సిగ్గుండాలని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ..

ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రిఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు.. అక్కచెల్లెమ్మల ఓట్లు, అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు.

ఇప్పుడు పేపర్ బ్యాలెట్ అంటూ ట్వీట్లు మొదలుపెట్టతారు.. ఇన్ని రోజుల తర్వాత .. అదీ హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో జగన్ అంతలావున ట్వీట్ పెట్టడం… ఇండియా కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగమే అంటున్నారు.

Related News

Crime News: దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Vijayasai reddy Tweet: సైలెంట్ గా కాక రేపుతున్నారా.. ఆ ట్వీట్ కి అర్థం అదేనా.. నెక్స్ట్ ప్లాన్ ఏంటి ?

Mopidevi Shocks Jagan: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

Nara Lokesh: ఫేక్ కి ఫ్యాక్ట్ కి తేడా తెలియని ఎంపీ గారూ.. తప్పుడు ప్రచారం మానుకోండి.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్

Deepak Reddy on Kodali Nani: కొడాలి నాని దాక్కున్నాడు.. ప్రజల చేతుల్లో పడితే ‘అంకుశం’ సినిమానే.. దీపక్ రెడ్డి

Big Stories

×