EPAPER

Air India: విమానంలో సాంకేతిక లోపం.. గాల్లోనే రెండు గంటలుగా చక్కర్లు.. బిక్కుబిక్కుమంటున్న 140 మంది ప్రయాణికులు!

Air India: విమానంలో సాంకేతిక లోపం..  గాల్లోనే రెండు గంటలుగా చక్కర్లు.. బిక్కుబిక్కుమంటున్న 140 మంది ప్రయాణికులు!

Technical Problem In air india: విమానంలో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో గాల్లోనే గంటల తడబడి చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఏఎక్స్‌బీ 613 విమానంలో టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో హడ్రాలిక్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో రెండు గంటలుగా గాల్లోనే చక్కర్లు కొడుతోంది.


తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఎయిర్ ఇండియా అధికారులు అప్రమత్తమయ్యారు. పైలెట్లు, సిబ్బంది సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే పైలెట్ ఎమెర్జెన్సీ ప్రకటించాడు. ఈ మేరకు తిరుచ్చి విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో ఫైరింజన్లు, అంబులెన్స్ సిద్ధం చేశారు. ఈ మేరకు పారా మెడిక్ సిబ్బందితోపాటు 20 ఫైర్ ఇంజిన్లు, 20 అంబులెన్స్ లు సిద్దంగా ఉంచినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు.

Also Read: నోయల్‌కే ఆ బాధ్యతలు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక


తిరుచ్చి నుంచి సాయంత్రం 5.40 నిమిషాలకు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మిగితా విమానాలను ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు దారి మళ్లించారు.

సురక్షితంగా దిగిన విమానం

తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న విమానం ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో గత మూడు గంటలుగా నెలకొన్ని ఉత్కంఠ వీడింది. ఎయిరిండియా బోయింగ్ విమానంలో హైడ్రాలిక్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు 3 గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. కొద్ది సెకన్ల క్రితమే తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది.

ఇదిలా ఉండగా, తీవ్ర ఉత్కంఠ తర్వాత తిరుచ్చిలో ఎయిరిండియా బోయింగ్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉండడంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. కాగా, హైడ్రాలిక్ సిస్టం దెబ్బతినడంతో దాదాపు 3 గంటలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ల్యాండింగ్ గేర్ ఓపెన్ కావడంతో పైలట్లు సేఫ్ ల్యాండింగ్ చేశారు.

 

 

Related News

Train Accident: మరో రైలు ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. కాలిపోయిన బోగీలు

Jimmy Tata: అన్న అలా.. తమ్ముడు ఇలా.. అజ్ఞాతవాసి జిమ్మీ టాటా గురించి మీకు తెలుసా?

TATA TRUST: నోయల్‌కే ఆ బాధ్యతలు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక

Elderly couple suicide: ‘బిచ్చమెత్తుకొని బతకండి’.. పిల్లల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు!

Congress Party Review Meeting: హర్యానాలో ఓటమి.. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌, అంతర్గత విభేదాలే కారణమా?

Ratan Tata Dog: నీ వెంటే నేనుంటా.. టాటా అంత్యక్రియల్లో పాల్గొన్న పెంపుడు కుక్క గోవా.. కన్నీళ్లు ఆగవు

Big Stories

×