EPAPER

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

Donald Trump Biopic The Apprentice: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది అప్రెంటీస్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికాతో పాటు కెనడా థియేటర్లలో ఇవాళ(అక్టోబర్ 11న) ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇందులో ట్రంప్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను  ప్రస్తావించారు. ట్రంప్ తన ఫస్ట్ వైఫ్ ఇవానాపై అత్యాచారం చేసినట్లు చూపించారు. వ్యాపార రంగంలో రాణించేందుకు క్రిమినల్స్ తో చేతులు కలిపినట్లు చిత్రీకరించారు. ఈ సినిమాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో కల్పిత మూవీగా తేల్చి చెప్పారు. ఈ సినిమాపై న్యాయపోరాటం చేస్తామని ట్రంప్ న్యాయవాదులు వెల్లడించారు.


ట్రంప్ జీవితంలోని వివాదాస్పద అంశాల ప్రస్తావ

ఇక ఈ చిత్రంలో డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఎదిగారో చూపించారు. 1970 నుంచి 1980 వరకు రియల్ రంగంలో కనీవినీ ఎరుగని రీతిలో వృద్ధి ఎలా సాధించారో ప్రస్తావించారు. తన వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరడం కోసం ఏకంగా అండర్ వరల్డ్ డాన్లతో ఒప్పందాలు చేసుకున్నట్లు చూపించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు డీల్స్ చేయడంలో అద్భుతమైన ట్రిక్స్ ప్లేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత వ్యాపారంలో ముందుకు వెళ్లేందుకు ఎలా అడ్డదారులు తొక్కారో ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.


‘అప్రెంటీస్’ మూవీపై ట్రంప్ టీమ్ ఆగ్రహం

‘అప్రెంటీస్’ సినిమాలోని చాలా సన్నివేశాలు కల్పితాలంటూ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ ఆరోపించింది. ఇదో పనికిరాని చెత్త సినిమాగా అభివర్ణించింది. హాలీవుడ్ లోని కొంత మంది ట్రంప్ వ్యతిరేకంగా పన్నిన కుట్రగా ఆరోపించింది. ఈ సినిమా ట్రంప్ జీవితానికి పూర్తి విరుద్దంగా ఉందని ట్రంప్ క్యాపెయిన్ టీమ్ చీఫ్ స్టెవెన్ వెల్లడించారు. కేవలం కట్టుకథలు అల్లి ట్రంప్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ సినిమాపై న్యాయ పోరాటం చేస్తామని మండిపడ్డారు. అటు ఈ ఆరోపణలపై దర్శకుడు అలీ అబ్బాసీ రియాక్ట్ అయ్యారు. సినిమా పూర్తిగా చూసిన తర్వాత స్పందించడం మంచిదన్నారు. ఈ సినిమాను ట్రంప్ చూస్తే ఆశ్చర్యపోతారని చెప్పారు.

ఎన్నికల వేళ ట్రంప్ కు ఇబ్బంది తప్పదా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థి కమలా హారీస్ టీమ్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నకు ‘అప్రెంటీస్’ సినిమా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రత్యర్థులు ఈ సినిమాను బేస్ చేసుకుని ట్రంప్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా ట్రంప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. త్వరలో జరగబోయే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఈ సినిమా ట్రంప్ మీద ప్రతికూలం మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడించారు.

Read Also: యూకేలో మనిషి పుర్రె వేలం.. భారత ప్రభుత్వం ఆగ్రహం

Related News

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

Israel Hits UN Base: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు

Naga Skull Auction: యూకేలో మనిషి పుర్రె వేలం.. భారత ప్రభుత్వం ఆగ్రహం

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Big Stories

×