EPAPER

Social Media : తొలి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇదే – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Social Media : తొలి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇదే  – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Social Media : ప్రస్తుతం ప్రతిఒక్కరి దినచర్య సామాజిక మాధ్యమాలతోనే ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. దీని వల్లే ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువవ్వడంతో పాటు వారితో సంభాషణ చేయగలుగుతున్నాం. భిన్న సంస్కృతులు, ప్రముఖ వ్యక్తులు, ఉద్యమాలు సహా పలు అంశాల గురించి సులభంగా తెలుసుకోగలుగుతున్నాం.


తొలి సామాజిక మాధ్యమం ఇదే – ప్రస్తుతం ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా గ్రామ్, ట్విటర్ (ఎక్స్​), లింక్డ్‌ ఇన్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. అయితే మొట్ట మొదటి సామాజిక మాధ్యమాన్ని 1997లో సిక్స్‌ డిగ్రీస్‌ పేరుతో అభివృద్ధి చేశారు. ఆండ్రూ విన్రీచ్‌ అనే వ్యక్తి దీనిని స్థాపించారు. ఒకానొక దశలో 10 మిలియన్ల యూజర్లకు చేరువైంది. 2001లో దీని ప్రయాణం ముగిసిపోయింది.

ఫేస్‌బుక్‌కు గట్టి పోటీనిచ్చినవి ఇవే – 2002లో వచ్చిన కాస్త అధునాతన సామాజిక మాధ్యమం ఫ్రెండ్‌ స్టర్. దీనికి స్వల్పకాలంలోనే మిలియన్ల యూజర్లు వచ్చారు. అనంతరం 2003లో లింక్డ్‌ ఇన్‌ వచ్చింది. 2004లో మై స్పేస్‌, ఫేస్‌బుక్‌ వచ్చాయి. 2006లో మై స్పేస్‌ ఫేస్​బుక్​కు గట్టి పోటి ఇచ్చి ప్రపంచ ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమంగా నిలిచింది.


యూట్యూబ్‌ 2005లో, ట్విటర్‌ 2006లో మొదలయ్యాయి. 2010లో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్థానం మొదలైంది. ఇవి కూడా తక్కువ కాలంలోనే ఫేస్‌బుక్‌కు గట్టి పోటీనిచ్చాయి. సంస్థగా ఎదిగింది. అనంతరం ఇన్‌స్టాను 1 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత వాట్సప్‌ను కూడా ఫేస్‌బుక్‌ 16 బిలియన్‌ డాలర్లకు కొనేసింది. ఈ క్రమంలోనే స్నాప్‌చాట్‌ను కొనాలని ప్రయత్నించినా కుదరలేదు. స్నాప్​ చాట్​ ఫేస్ బుక్ డీల్​ను తిరస్కరించింది.

2016లో చైనాకు చెందిన టిక్‌ టాక్‌ వచ్చింది. ఇది ప్రజాదరణ బాగా పొందింది. కానీ భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంగా దీన్ని నిషేధించారు. అయినా పలు దేశాల్లో దీన్ని హవా కొనసాగుతోంది.

ALSO READ : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?

ఎంతమంది యూజర్లంటే..!

ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా 4.48 సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు

ఒక్కో యూజర్ సగటున 6.6 వేర్వేరు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ తో పాటు డెస్క్ టాప్ ను సైతం సోషల్ మీడియా వాడేందుకు ఉపయోగిస్తున్నారు

సోషల్ మీడియాను యూజ్ చేసేందుకు దాదాపు 99 శాతం మంది తమ ఫోన్​ను, 1.32 శాతం మంది డెస్క్‌ టాప్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

అమెరికాలో 72.3 శాతం అంటే, అక్కడి జనాభాలో 24 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారు.

ఫేస్‌బుక్‌కు కనీసంగా 2.9 బిలియన్‌, వాట్సప్‌కు 2 బిలియన్‌, యూట్యూబ్‌కు 2.3 బిలియన్‌, ఎఫ్‌ బీ మెసేంజర్‌కు 1.3 బిలియన్‌, వీ చాట్‌కు 1.2 బిలియన్ల యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

యూట్యూబ్‌లో నిమిషంలో 300 గంటల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయట. ఈ  విషయం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ కలిపి రోజుకు 60 బిలియన్ల సందేశాలను పంపిస్తున్నాయట.

రోజుకు 500 మిలియన్ల మంది ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ను వాడుతున్నారట.

సోషల్ మీడియాను వాడుతున్న వారిలో యుక్త వయసు వారితో పాటు మధ్య వయస్కులు సైతం సైతం ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Oppo Find X8 : కిర్రాక్ ఫీచర్స్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Jio ISD : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే

ICICI credit card : ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు షాక్.. ఇకపై కోత తప్పదు!

Internet : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?

Tesla Robo : తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

WhatsApp Scam: వాట్సాప్ లో నయా స్కామ్, ఇలా చేశారో అంతే సంగతులు!

Big Stories

×