EPAPER

Telangana Government: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. ఇక వారందరి కల నెరవేరినట్లే..

Telangana Government: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. ఇక వారందరి కల నెరవేరినట్లే..

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. ముందడుగు వేస్తోంది. ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ సర్కార్.. ఆ హామీలలో మహిళలకు ఉచిత బస్సు, గృహాజ్యోతి, రుణమాఫీ, జాబ్ క్యాలండర్.. ఇలా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసి.. ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ప్రజాదరణ పొందుతోంది. అయితే తాజాగా ఇందిరమ్మ గృహాల కేటాయింపు కోసం ప్రభుత్వం అడుగులు వేసి.. ప్రజలకు దసరా కానుక ప్రకటించినట్లైంది.


పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ గృహాల కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సంబంధించిన జీవోను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

ఈ కమిటీలను గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఏర్పాటు చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి లేక సర్పంచ్ చైర్ పర్సన్ గా ఉండాలని, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్ పర్సన్ గా ఉండేలా జీవో జారీ అయింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా స్థానిక పంచాయతీ కార్యదర్శి, వార్డుకు సంబంధించిన అధికారి ఉంటారు. అలాగే కమిటీలో ఇద్దరు స్వయం సహాయక గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికంగా నివాసం ఉంటున్నవారు కూడా అంటారు.

Also Read: CM Revanth Reddy: కేసీఆర్ కు ప్రజలు జీరో మార్క్స్ ఇచ్చినా సిగ్గు రాలేదు.. సీఎం రేవంత్

ఈ కమిటీలను శనివారం నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుండి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. అంతేకాకుండా కమిటీల ఏర్పాటు కోసం పేర్లను పంపాలని సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం.. లబ్ధిదారులకు పథకం యొక్క తీరుతెన్నులు వివరించడం.. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా పథకం వర్తింపజేసేలా చూస్తారు. ఇప్పటికే ఉద్యోగ జాతర ప్రకటించి.. నిరుద్యోగులకు వరాలు కురిపించిన రేవంత్ సర్కార్.. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు అడుగులు వేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే దసరా కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇటీవల బోనస్ ను సైతం అందజేసింది. ఒక్కొక్క కార్మికుడికి రూ.1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.5 వేలు చొప్పున ప్రకటించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇటీవల నిర్వహించిన సింగరేణి కార్మికుల సమావేశంలో ప్రభుత్వానికి జేజేలు పలికారు సింగరేణి కార్మికులు. అంతేకాదు ఇటీవల డీఎస్సీ నిర్వహించి 11వేలకు పైగా టీచర్ ఉద్యోగ నియామక పత్రాలను కూడా సీఎం రేవంత్ అందజేశారు. ఇలా రేవంత్ సర్కార్ దసరా సంధర్భంగా ప్రజలకు కానుకల వర్షం కురిపించిందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద, ధనిక తేడా లేకుండా అందరి సంక్షేమమే ధ్యేయంగా సాగే తమ ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజలు అండదండగా నిలవాలని.. దసరా పర్వదినంను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Related News

Mohammad Siraj DSP : డీఎస్పీ సిరాజ్

BJP BRS Alliance: బీఆర్ఎస్‌తో పొత్తా? నో.. నెవర్, హైడ్రా ఏమీ కొత్తదేం కాదు: బీజేపీ నేత కిషన్ రెడ్డి

Congress-Aimim : ఎంఐఎంతో దోస్తీ కుదరని పని : మహేశ్ కుమార్ గౌడ్

Bhatti Vikramarka : పనిగట్టుకుని విమర్శలా ?

Telangana Jobs: గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Mahesh Kumar Goud : కొండా సురేఖను తొలగిస్తారని ప్రచారం… క్లారిటీ ఇచ్చేసిన పీసీసీ చీఫ్

Telangana: సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజులే సమయం!

Big Stories

×