EPAPER

CM Revanth Reddy: కేసీఆర్ కు ప్రజలు జీరో మార్క్స్ ఇచ్చినా సిగ్గు రాలేదు.. సీఎం రేవంత్

CM Revanth Reddy: కేసీఆర్ కు ప్రజలు జీరో మార్క్స్ ఇచ్చినా సిగ్గు రాలేదు.. సీఎం రేవంత్

CM Revanth Reddy: గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పాఠశాలలను మూసి వేశారని, తాము మాత్రం అన్ని పాఠశాలలను పునః ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


షాద్ నగర్ లో జరిగిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. దళితులకు, గిరిజనులకు విద్యను దూరం చేసేందుకు బీఆర్ఎస్ తన ప్రభుత్వ పాలనలో పాఠశాలలను మూసివేసిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య, పేద కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన అందించేందుకు తాము నియోజకవర్గానికి ఒక స్కూల్.. 20 నుండి 25 ఎకరాలలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే టీచర్స్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు.


34 వేల మంది టీచర్ల బదిలీ, 21 వేల మంది టీచర్స్ కి ప్రమోషన్ ఇచ్చామన్నారు. అలాగే ఇటీవల 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ లోని ప్రతి బిడ్డ.. చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తన కోరికగా సీఎం అన్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఇలా ప్రతి విద్యార్థి భవిష్యత్ లో బంగారు బాటలో నడవాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీనని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రేవంత్ తెలుపగా.. సభకు హాజరైన ప్రజలు గట్టిగా కేకలు వేస్తూ తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Also Read: Cm Revanth Reddy : బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ… ఎమ్మెల్యేలు, సంఘాలతో భేటీ
మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలు ఇచ్చినా.. ఇంకా బుద్ది రాలేదన్నారు. తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలను, రెసిడెన్షియల్ స్కూల్స్ ని నిర్లక్ష్యం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసిఆర్ పదేళ్ల కాలంలో విద్యార్థులకు ఏనాడైనా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారా అంటూ ప్రశ్నించారు. మీ పిల్లలు బాగా చదువుకోవాలి.. కానీ పేదల పిల్లలు చదువుకోవద్దా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. పార్టీ కార్యాలయాలు అన్ని జిల్లాలలో నిర్మించిన కేసిఆర్.. ఒక్క జిల్లాలో కూడా పాఠశాల నిర్మాణం చేయలేదన్నారు.

అలాగే మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ.. దొరల పార్టీలో చేరిన మీకు గురుకులాల అభివృద్ది కనిపించడం లేదా.. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలన్న తమ సంకల్పాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ. ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ ఒక మంచి అధికారిగా తాను గౌరవిస్తానని, ఇప్పటికైనా తమ ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పట్ల వ్యతిరేకించడం మానుకోవాలన్నారు. కేసీఆర్ చెప్పిన మాటలు చెప్పకుండా నిజాలు గ్రహించాలని కోరారు. 100 కోట్ల నుండి 120 కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక విద్యను అన్ని వర్గాల వారికి అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఈ స్కూల్స్ నిర్మాణం చకచకా సాగుతుందని, విద్యార్థులు బాగా చదివి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని రేవంత్ ఆకాంక్షించారు.

Related News

Telangana: సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజులే సమయం!

Kishan Reddy on BRS : బీఆర్​ఎస్​తో బీజేపీ పొత్తు… తేల్చేసిన కిషన్ రెడ్డి. ఏమన్నారంటే ?

Telangana Government: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. ఇక వారందరి కల నెరవేరినట్లే..

Liquor Sales In Telangana: ఇదేందయ్యా ఇది.. తెగ తాగేస్తున్న మందుబాబులు.. దసరాకు ముందే జోరందుకున్న మద్యం విక్రయాలు

Cm Revanth Reddy : బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ… ఎమ్మెల్యేలు, సంఘాలతో భేటీ

Ex CS Somesh Kumar : మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌‌కు షాక్.. రంగంలోకి ఈడీ

Big Stories

×