EPAPER

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

PM MODI East Asia Summit| యుద్ధాలతో దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం లభించదని.. చర్చలు, దౌత్య విధానాల ద్వారా మాత్రమే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. వియత్నాంలో జరుగుతున్న తూర్పు ఆసియా దేశాల సమావేశాల్లో శుక్రవారం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వేర్వేరు యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం వాటిల్లుతోందని.. యుద్ద ప్రభావాలు నిలువరించడానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అడ్డులేకుండా వాణిజ్యం చేసుకోవడానికి కొన్ని నిబంధనలు రూపొందించాల్సిన అవసరముందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

వియత్నాం తూర్పు ఆసియా సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ” ప్రపంచంలోని వివిధ భాగాల్లో జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. అందరూ యూరోప్, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో త్వరగా శాంతి, స్థిరమైన పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటున్నారు. నేను బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చాను. అందుకే ఇది యుద్ధాల యుగం కాదని నమ్ముతున్నాను. సమస్యలకు పరిష్కారం యుద్దరంగంలో లభించదు. ప్రతి దేశం ఇతర దేశాల సార్వభౌమత్వం, సరిహద్దులు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. సమస్యలు వస్తే దౌత్య విధానాలతో, మానవీయ కోణంలో చర్చల ప్రాధాన్యం ఇవ్వాలి. శాంతి స్థాపన కోసం భారత దేశం ఎప్పుడూ తన సహకారం అందిస్తూనే ఉంటుంది.


Also Read:  ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

సముద్ర మార్గంలో వాణిజ్యానికి ఏ అడ్డులేకుండా ఉండేందుకు అన్ని దేశాలు ఐక్యారాజ్యసమితి సముద్ర చట్టాలను(UNCLOS) పాటించాలి. ఇండో పసిఫిక్ ప్రాంతానికి.. సౌత్ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వం చాలా ముఖ్యం. అందుకే ఇండో పసిఫిక్ దేశాలు అభివృద్ధి, సంక్షేమం కోసం కొన్ని నియమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెద్ద సవాల్ గా మారింది. ప్రపంచదేశాలన్నింటినీ మానవత్వం కోసం కలిసి చేస్తే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.” అని అన్నారు.

21 వ ఆసియన్ ఇండియా సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లావోస్ దేశానికి రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. సమావేశాల్లో ఆయన అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ను కలిశారు. ఇటీవల అమెరికాలో మిల్టన్ తుఫాన్ కారణంగా 14 మంది మృతిచెందారు. తుఫాను ప్రభావంతో మృతిచెందిన వారి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

Related News

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

Israel Hits UN Base: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు

Naga Skull Auction: యూకేలో మనిషి పుర్రె వేలం.. భారత ప్రభుత్వం ఆగ్రహం

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Big Stories

×