EPAPER

Korean Skin: కొరియన్ స్కిన్ కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Korean Skin: కొరియన్ స్కిన్ కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Skin Care Tips: ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు, టానింగ్ వంటి సమస్యలు సర్వసాధారణం. తరచుగా మహిళలు తమ చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని రకాల హోం రెమెడీలను వాడటం వల్ల ముఖంపై మచ్చలను వదిలించుకోవచ్చు.


హోం రెమెడీస్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా వీటితో ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. కొన్ని రకాల హెం రెమెడీస్ వాడటం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

కొరియన్ స్కిన్ కోసం..
1. చందనం పొడి
2. అలోవెరా జెల్


దీన్ని ఎలా ఉపయోగించాలి ?

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల గంధపు పొడి వేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ కలబంద జెల్‌ను వేసి బాగా కలపండి. తర్వాత బ్రష్ సహాయంతో ముఖం మీద అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల పాటు దీనిని ముఖం మీద ఉంచండి. తర్వాత శుభ్రం చేయండి. దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు. కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం మీ ముఖంపై కనిపిస్తుంది.

Also Read: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

ప్రయోజనాలు..

చందనం ముఖ చర్మానికి కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా, దీని వాడకంతో ముఖంపై రంధ్రాలు కూడా క్లియర్ అవుతాయి. గంధాన్ని చర్మం నుండి టానింగ్ తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. అలోవెరా జెల్‌లో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-బి ఉన్నాయి. ఇది చర్మానికి పూర్తి పోషణను అందిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలోవెరా జెల్‌లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది స్కిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యలను నివారిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Dasara Recipes: ఈ రెసిపీలను దసరా రోజు తప్పక ట్రై చేయండి

Health Problems: ఏంటీ.. ప్రపంచంలో ఇంతమందికి ఆ సమస్య ఉందా? ఈ లక్షణాలు చూసి.. ఆ లిస్టులో మీరు ఉన్నారేమో చూసుకోండి

Winter Skin Care: చలికాలంలో స్కిన్ కాపాడుకోవడానికి ఇవే బెస్ట్ టిప్స్ ..

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Heart Disease: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా ? మీ లైఫ్ రిస్క్‌లో పడ్డట్లే

Mental Health: మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ?నిపుణులు ఏం చెబుతున్నారంటే

Big Stories

×