EPAPER

Tesla Robo : తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

Tesla Robo : తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

Tesla Robo : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టెస్లా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న we robot ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో భాగంగా టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసారు. కొత్త రోబో వ్యాన్, రోబో టాక్సీ, ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ లను లాంచ్ చేశారు.


టెస్లా కంపెనీ నిర్వహించిన we robot ఈవెంట్లో టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ నూతన ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేశారు. మనిషి రోజు వారి జీవితంలో రోబోలను ఏకీకృతం చేయడానికి టెస్లా కంపెనీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఈవెంట్లో టెస్లా కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆప్టిమస్ రోబోట్లను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆప్టిమస్ రోబోలని ఒకేసారి ఒక గ్రూప్గా వేదిక పైకి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాయి.

ఆప్టిమస్ రోబోట్


ఈవెంట్లో పరిచయం చేసిన ఆప్టిమస్ రోబోట్స్ ఒక మనిషి జీవితంలో నిత్యం జరిగే పనులను నిర్వహిస్తాయని తెలిపారు. మనుషుల మధ్య నడుస్తూ మనిషికి కావాల్సిన అన్ని పనులు చేయగలిగే సామర్థ్యాన్ని ఆప్టిమస్ రోబోట్స్ కలిగి ఉంటాయని చెప్పుకొచ్చారు. బరువులు మోయటం, పెంపుడు జంతువులను నడిపించడం, బేబీ సెట్టింగ్ వంటి పనులన్నీ చేస్తుందని తెలిపారు. ఇక ఒక ఆప్టిమస్ రోబోట్ విలువ 20 వేల నుంచి 30 వేల డాలర్లు ఉంటుందని చెప్పుకొచ్చారు.

రోబోట్స్ చేసే ప్రతి పనిని అలెన్ మాస్క్ క్షుణ్ణంగా వివరించారు. రోబోట్స్ అటు ఇటు తిరగడంతో పాటు కప్పులు పట్టుకోవడం, గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేయడం, తిరిగి వాటిని అందించడం వంటి చిన్న చిన్న పనుల నుంచి బేబీ సిట్టింగ్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తాయని తెలిపారు.

ఇప్పటికే టెస్లా పలు రోబోట్స్ ను తయారు చేసిందని.. ముందు ముందు వీటి అవసరం ఎంత ఉంటుందని మిలియన్ యూనిట్లలో రోబోట్స్ ను ప్రపంచానికి పరిచయం చేయబోతుందని మాస్క్ వివరించారు.

రోబో టాక్సీ

టెస్లా ఈవెంట్లో సొంతంగా డ్రైవింగ్ చేసే సామర్థ్యం కలిగిన రోబో టాక్సీలను సైతం ముస్క్ ఆవిష్కరించారు. ఇక 2027 నాటికి ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల క్రితం సెల్ఫ్ డ్రైవింగ్ చేసే రోబో టాక్సీ లను ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్పిన అనంతరం 2027లో ప్రపంచానికి అందుబాటులో వస్తాయని చెప్పడం టెక్ ప్రియులకు శుభవార్త అని చెప్పాలి. ఎలాన్ మాస్క్ వాగ్దానం చేసిన దాదాపు దశాబ్దం తర్వాత రోబో టాక్సీ లను తీసుకువస్తున్నారు.

రోబో టాక్సీలలో స్టీరింగ్, వీల్ పెడల్ లేకుండా ఉంటాయని చెప్పుకొచ్చారు. పూర్తిగా ఎలక్ట్రిక్ మీద ఆధారపడి ఈ కార్స్ నడుస్తాయని.. దీని ధర 30 వేల డాలర్లు వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. వైర్లెస్ సహాయంతో చార్జింగ్ చేయబడుతుందని.. ఇక మనిషి నడిపే సాధారణ కార్ల కంటే పది నుంచి 20రెట్లు సురక్షితంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

సైబర్ క్యాబ్

ఇప్పటికే టెక్సాస్ కాలిఫోర్నియాలో రోబో టాక్సీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఉన్న మోడల్స్ ను అప్డేట్ వర్షన్ లో పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ తో తీసుకురావాలని టెస్లా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సైబర్ క్యాబ్ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వీటిని సైతం 2027 కన్నా ముందే ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పుకొచ్చారు.

ది రోబో వాన్

టెస్లా ఈవెంట్లో ది రోబో వ్యాన్ ను సైతం ఎలాన్ మస్క్ పరిచయం చేశారు. ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే విధంగా రోబోలు స్వయంగా నడిపే ఈ వ్యాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పుకు వచ్చారు. కదిలే టోస్టర్లలా కనిపించే ఈ రోబో వాన్ లో స్టీరింగ్, వీల్ పెడల్స్, డ్రైవర్స్ ఉండరని పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ తో నడుస్తుందని 20 మంది వరకు కూర్చొని ప్రయాణించవచ్చు అని మస్క్ చెప్పుకొచ్చారు.

 

Related News

WhatsApp Scam: వాట్సాప్ లో నయా స్కామ్, ఇలా చేశారో అంతే సంగతులు!

Google Maps parking: గూగుల్ మ్యాప్స్‌లో కారు పార్కింగ్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?..

Social Media problems : సంసారంలో సోషల్ మీడియా తిప్పలు – భార్యభర్తలను విడదీస్తున్న సామాజిక మాధ్యమాలు!

Apple M4 MacBook : త్వరలోనే మరో ఆపిల్ ఈవెంట్.. మాక్ బుక్ ప్రో, మాక్ మినీ, ఐమాక్ లాంఛిగ్ ఎప్పడంటే!

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

Big Stories

×