EPAPER

HBD Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్..!

HBD Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్..!

HBD Amitabh Bachchan.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు, హేళనలు. నీ వాయిస్ ఏంటి అలా ఉంది..? అంత ఎత్తు ఉన్నావేంటి.? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ? ఇలా ఎన్నో విమర్శలు ఆయనను చుట్టుముట్టాయి. కెరియర్ ప్రారంభంలో ఆయనను అనకూడని మాటలన్నారు.. కట్ చేస్తే.. అదే వాయిస్ ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను శాసిస్తోంది. భారత అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ , పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ఆయన అందుకున్నారు. త్వరలోనే భారత సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకోబోతున్నారు అమితాబ్ బచ్చన్.


సినిమా హిస్టరీ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు..

వెండితెర యాంగ్రీ యంగ్ మ్యాన్, ఎవర్గ్రీన్ స్టార్.. బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమా హిస్టరీ అనే పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీను రాసుకున్నారు. 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ లో జన్మించారు అమితాబ్ బచ్చన్. తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్లోని ఫైసలబాద్ కు చెందిన సిక్కు మహిళ ఆమె. ఇకపోతే ఈరోజు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.


అమితాబ్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్..

అమితాబ్ బచ్చన్ అసలు పేరు ఇంక్విలాబ్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన తన పేరును అమితాబ్ గా మార్చుకున్నారు. దాని అర్థం ఎప్పటికీ ఆరని దీపం. పేరుకు తగ్గట్టుగానే 77 సంవత్సరాలు వచ్చినా యువ హీరోలకు దీటుగా నటిస్తూ యాక్షన్స్ సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

వాయిస్ నెరేటర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. 1969లో బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ చిత్రీకరించిన అవార్డు విన్నింగ్ మూవీ భువన్ షోమ్ అనే సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టారు. అదే ఏడాది ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఏడుగురు హీరోలలో ఒకరిగా నటించినా.. ఆ సినిమా హిట్ కాలేదు. కానీ అమితాబ్ కి మాత్రం కలిసొచ్చింది.. తొలి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా నేషనల్ అవార్డు లభించింది. అంతేకాదు ఆయన కెరియర్ లో బ్లాక్ అండ్ వైట్ చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

అయితే ఆ తర్వాత ఏకంగా 12 సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. కసితో ఎలాగైనా సరే సినిమా చేయాలనుకున్న అమితాబ్ కి జంజీర్ సినిమా మళ్లీ అవకాశాన్ని కల్పించింది. ఈ సినిమాలో ఆయన పేరు విజయ్. ఆ సెంటిమెంట్ తోనే తర్వాత దాదాపు 20 సినిమాలలో అదే పేరుతో నటించారు అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్ లో ద్విపాత్రాభినయం పాత్రలు ఎక్కువగా చేసింది కూడా ఈయనే. అంతేకాదు ఈయన రెండు చేతులతో కూడా రాయగలరు. ఎయిర్ ఫోర్స్ లో చేరి ఇంజనీర్ అవ్వాలనుకున్నారు. 1995లో జరిగిన మిస్ వరల్డ్ కాంటెస్ట్ కి అమితాబ్ జడ్జిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు గ్రేట్ గాట్స్ బి అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు.

ఇకపోతే చివరిగా 50 రూపాయలతో మొదలైన ఆయన సంపాదన రూ.500 నెల జీతానికి చేరింది.. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేడు సంవత్సరానికి రూ 60 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ రూ.3,396 కోట్లు అన్నట్లు సమాచారం.

Related News

Lucky Bhaskar : ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Bigg Boss: మహిళా కమిషన్ నోటీసులు.. షాక్ లో బిగ్ బాస్..!

Game Changer Release Date: హాలీవుడ్ లోనూ తిరుగులేదు… ఇక గ్లోబల్ రేంజ్ లో రికార్డు బ్రేక్ అవ్వడమే

Appudo Ippudo Eppudo Teaser: ప్రపంచంలో అబ్బాయిలందరూ తాగడానికి కారణం అమ్మాయిలేరా..

Kriti Shetty: నక్కతోక తొక్కిన బేబమ్మ.. ఇప్పుడైనా సక్సెస్ అందుకుంటుందా ..?

Akshay Kumar: ఆటో రిక్షా నడుపుతోన్న మహిళకు అక్షయ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఆమెకు ఎంత సాయం చేశాడంటే?

Big Stories

×