EPAPER

Martin: విడుదల కోసం రూ.8 కోట్లు త్యాగం చేసిన హీరో… ఇక లైన్ క్లియర్ అయినట్టే..!

Martin: విడుదల కోసం రూ.8 కోట్లు త్యాగం చేసిన హీరో… ఇక లైన్ క్లియర్ అయినట్టే..!

Martin.. కన్నడ హీరో ధ్రువ సర్జ (Dhruva sarja)హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం మార్టిన్.. దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ చేయడం మానేసి కోర్టు చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా మార్టిన్ సినిమా వివాదం ఇప్పుడు కర్ణాటక హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాపై చిత్ర దర్శకుడు ఏపీ అర్జున్ స్వయంగా సినిమా విడుదలను ఆపివేయాలంటూ హైకోర్టులో కేసు వేశారు.


మార్టిన్ సినిమా నిలిపివేత..

మార్టిన్ సినిమా నిర్మాత ఉదయ్ మెహతా డబ్బు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. మరొకవైపు వీఎఫ్ఎక్స్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థపై మోసం కేసును దాఖలు చేయగా.. ఉదయ్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదులో ఏపీ అర్జున్ పేరు కూడా ఉంది. తన పేరు వేయకుండా నిర్మాత సినిమా ప్రచారం చేస్తున్నాడంటూ ఏపీ అర్జున్ హైకోర్టుకు ఎక్కారు. ఇక ఈ వివాదం సద్దుమనగనే లేదు.. దీంతో సినిమా విడుదల చేయకూడదని, అటు నిర్మాత ఇటు డైరెక్టర్ గొడవ పడుతున్న నేపథ్యంలో.. హీరో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.


రూ.8 కోట్లు కట్టి లైన్ క్లియర్ చేసిన ధృవ..

దాదాపు ఐదేళ్లుగా సినిమా కోసం ఎదురుచూస్తున్న ధ్రువ సర్జ సినిమాను విడుదల చేయడానికి డబ్బు కట్టి వివాదాన్ని క్లియర్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. 120 రోజుల్లో రూ.8 కోట్లు క్లియర్ చేస్తానని, హీరో ధ్రువ సర్జ ఫైనాన్షియర్ తో ఒప్పందం చేసుకున్నారట. ఈ మేరకు ఈరోజు లేదా రేపు సినిమా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే త్వరలోనే దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే అటు నిర్మాత, ఇటు డైరెక్టర్ కు సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఫైనాన్షియర్ తో మాట్లాడి సినిమాను విడుదల చేయబోతున్నారట ధ్రువ సర్జ.

విడుదలకు సర్వం సిద్ధం..

ఇకపోతే సినిమా ఈరోజు విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ తో సహా విడుదల చేసింది. అక్టోబర్ 11న విడుదల కావాల్సిన ఈ సినిమా కోసం థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను చిత్ర బృందం ఫూల్స్ చేశారు. ముఖ్యంగా వీరిద్దరి గొడవ వల్ల సినిమా ప్రింట్ ను థియేటర్ కు ఇవ్వలేదని సమాచారం. ఏది ఏమైనా సినిమా కోసం థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. అందుకే రంగంలోకి దిగిన ధృవ సర్జ లైన్ క్లియర్ చేసి ఫైనాన్షియర్ తో ఒప్పందం తీసుకొని సినిమాను విడుదల చేయబోతున్నారట. ఇక బెనిఫిట్ షోస్ వేస్తారా..? లేకపోతే డైరెక్ట్ గా సినిమాను థియేటర్లో విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

Appudo Ippudo Eppudo Teaser: ప్రపంచంలో అబ్బాయిలందరూ తాగడానికి కారణం అమ్మాయిలేరా..

Kriti Shetty: నక్కతోక తొక్కిన బేబమ్మ.. ఇప్పుడైనా సక్సెస్ అందుకుంటుందా ..?

Akshay Kumar: ఆటో రిక్షా నడుపుతోన్న మహిళకు అక్షయ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఆమెకు ఎంత సాయం చేశాడంటే?

HBD Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్..!

Viswam Twitter Review : ‘విశ్వం’ ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్స్ సీన్స్ వేరే లెవల్.. ట్రైన్ సీన్స్ హైలెట్..

Martin: ఆడియన్స్ ను ఫూల్స్ చేసిన చిత్ర బృందం.. ఫ్యాన్స్ ఫైర్..!

Big Stories

×