EPAPER

Nampally Durga Mata Idol: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..

Nampally Durga Mata Idol: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో దారుణం.. అమ్మవారి విగ్రహం ధ్వంసం, అర్ధరాత్రి కరెంట్ తీసి..

Miscreants broken Durga Mata Idol: ప్రతీ ఏడాది ఎక్కడో దగ్గర హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.


దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మ‌వారి విగ్ర‌హం ఏర్పాటు చేశారు. రాత్రి దండియా కార్య‌క్ర‌మం పూర్తయ్యే వరకూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్నారు పోలీసులు. అర్థ‌రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.

ALSO READ: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ


కరెంట్ ఆపేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, ఆపై అమ్మ‌వారి విగ్రహం డ్యామేజ్ చేశారు. అమ్మవారి చేతి విరిగిపడి కింద ఉంది. ఉదయం చుట్టుపక్కలున్న భక్తులు విగ్రహం డ్యామేజ్ అయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ారు అబిడ్స్ ఏసీపీ చంద్ర‌శేఖ‌ర్‌.

ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారాయన. వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు బేగంబజార్ పోలీసులు. ఈ ఘటనపై భక్తుల మండిపడుతున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గతంలో కాకినాడలో ఇలాంటి ఘటన జరిగింది. దుర్గామాత అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్ వంతైంది.

 

 

 

 

Related News

Sircilla RDO: తండ్రిని పట్టించుకోని కొడుకు.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు.. అసలు ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఇవీ ప్రత్యేకతలు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

IAS Transfers : త్వరలోనే భారీగా ఐఏఎస్ బదిలీలు ? 16న కొత్త ఆఫీసర్స్ వచ్చేస్తున్నారోచ్ !

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Big Stories

×