EPAPER

Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ సీక్రెట్‌ బయట పెట్టిన రాథోడ్‌ – రాథోడ్‌కు తలతిక్క అంటూ తిట్టిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ సీక్రెట్‌ బయట పెట్టిన రాథోడ్‌ – రాథోడ్‌కు తలతిక్క అంటూ తిట్టిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today Episode:   స్కూటీ మీద రయ్యుమంటూ అమర్‌ ఇంట్లోకి దూసుకొచ్చిన కరుణ రాథోడ్ ను జరగు అంటుంది. రాథోడ్‌ అటూ ఇటూ తిరగుతుంటే వెంటనే స్కూటీతో రాథోడ్‌ ను గుద్దేస్తుంది కరుణ. దీంతో రాథోడ్‌ కోపంగా అసలు నీ బండికి బ్రేకుల్లేవా? అని అడుగుతాడు. బ్రేకులు ఉన్నాయి కానీ పడలేదు అని చెప్తుంది కరుణ. అయినా ఇంటికి ఎందుకొచ్చావు అని రాథోడ్‌ అడగ్గానే అమరేంద్ర గారిని కలవడానికి వచ్చాను అని చెప్తుంది.


సార్‌ను కలవాలంటే ఆఫీసుకు రావొచ్చు కదా? అంటాడు రాథోడ్‌. ఆఫీసుకే వెళ్లాను కానీ అక్కడ లేరు అని చెప్పగానే ఇక్కడికి వచ్చాను అంటూ ఇంట్లోకి రాథోడ్‌ ఆపుతున్న వినకుండా వెళ్లిపోతుంది. అంతా గమనిస్తున్న ఆరు ఆయన ఎందుకు ఈ అమ్మాయిని సీక్రెట్‌ గా కలవాలనుకున్నారు. అని గుప్త దగ్గరకు వెళ్లి అడుగుతుంది. గుప్త తనకు తెలియదని చెప్తాడు. అయితే ఆ కిటికీ దగ్గరకు వెళ్లి చూద్దామని గుప్తకు చెప్తుంది. గుప్త రాననేసరికి ఆరు ఒక్కతే వెళ్లి చూస్తుంది.

లోపలికి వెళ్లిన కరుణ, మిస్సమ్మను చూసి దోస్త్‌ మేరా దోస్త్‌ సాంగ్‌ పాడుతుంది. మిస్సమ్మ కూడా పాట పాడుకుంటూ వచ్చి కరుణను హగ్‌ చేసుకుంటుంది. తర్వాత కరుణ ఎట్లున్నవే అని మిస్సమ్మను అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వెట్లున్నావు అని అడుగుతుంది మిస్సమ్మ. నేను మస్తుగున్న అని కరుణ చెప్పగానే నువ్వేంటి ఇక్కడ? అని అడుగుతుంది మిస్సమ్మ. ఇంతలో  పైనుంచి వచ్చిన అమర్‌. టెన్షన్‌ పడుతూ కరుణ ఇక్కడికి వచ్చిందేంటి? అసలు రాథోడ్‌ కు చెప్పిన దండగే అని మనసులో  అనుకుంటాడు అమర్‌. అమర్‌ను చూసిన కరుణ పలకరిస్తుంది. అమర్‌ కూడా చిన్నగా హాయ్‌ అంటూ కళ్లతోనే రాథోడ్‌ ను కరుణ ఇక్కడేం చేస్తుంది అని అడుగుతాడు.


అపడానికి ట్రై చేశాను కానీ ఆగకుండా వచ్చేసింది సార్ అని రాథోడ్‌ కూడా కళ్లతోనే సమాధానం చెప్తాడు. ఇద్దరిని గమనిస్తున్న కరుణ మీరేంటి కళ్లతోనే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదని రాథోడ్‌ చెప్తాడు. ఇంతలో శివరాం వచ్చి కరుణను పలకరిస్తాడు. సరేగానీ నువ్వేంటి సడెన్‌గా వచ్చి షాక్ ఇచ్చావు అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో సడెన్‌గా రావడం ఏందే. అమరేంద్ర గారు ఫోన్‌ చేసి రమ్మంటే మరీ వచ్చిన. మీ ఆయన నీకు చెప్పలేదా?  అని అడుగుతుంది కరుణ.

మిస్సమ్మ, అమర్‌ను మీరే రమ్మన్నారా? అని అడుగుతుంది. అమర్‌ ఏమీ చెప్పకుండా అలాగే చూస్తుండిపోతాడు. ఏవండి పలకరేంటండి అని మిస్సమ్మ అడగడంతో రాథోడ్‌ కల్పించుకుని ఆఫీసుకు రమ్మన్న  అమ్మాయి సడెన్‌గా ఇంటికి వస్తే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎలా కవర్‌ చేయాలో ఆలోచించుకోవద్దా మా సారు. అసలే మా సారుకు అంజు పాపలా అబద్దం చెప్పడం రాదు అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. బయట నుంచి అంతా గమనిస్తున్న ఆరు కూడా

అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు దేవుడా అనుకుంటుంది. ఇంతలో కవర్‌ చేయడం ఏంటి? రాథోడ్ అని అడుగుతాడు. నిర్మల కూడా అబద్దం చెప్పలేకపోవడం ఏంటి..? అని ప్రశ్నిస్తుంది. దీంతో ఎం చెప్పాలో అర్థం కాక రాథోడ్‌ పిచ్చిచూపులు చూస్తుంటాడు. అమర్‌ కల్పించుకుని రాత్రి రాథోడ్‌ సరిగ్గా నిద్రపోలేదమ్మా అందుకే ఇలా తలతిక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పగానే రాథోడ్‌ ఆవలిస్తూ నిద్ర వచ్చిన వాడిలా నటిస్తాడు. అయితే నీతో పనుంది బయటకు రా రాథోడ్‌ అంటూ అమర్‌ బయటకు వెళ్లిపోతాడు. మిస్సమ్మ, కరుణ కిచెన్‌ లోకి వెళ్లిపోతారు. ఇద్దరూ అమర్‌ గురించి మాట్లాడుకుంటారు. బయటకు వెళ్తున్న రాథోడ్‌ వెనకాలే ఆరు వెళ్తూ వీళ్లు కచ్చితంగా ఏదో తేడా చేస్తున్నారు. అదేంటో కనుక్కోవాలి అనుకుంటుంది.

కారు దగ్గర నిలబడ్డ అమర్‌ దగ్గరకు రాథోడ్‌ వెళ్తాడు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఉంటారు. ఆరు పక్కనే ఉండి వీళ్లనే గమనిస్తుంది. రాథోడ్‌ ఏడుపు ముఖం పెట్టి  సార్‌ నిజంగా ఆ అమ్మాయి ఇంటికి వస్తుందనుకోలేదు. ఆఫీసుకు వెళ్లిందంట మీరు ఇంటికి వెళ్లారు అని చెప్పగానే ఇంటికి వచ్చిందట అంటాడు. అయినా ఆ అమ్మాయిని ఇక్కడే బయట ఆపోచ్చు కదా రాథోడ్ అంటాడు అమర్‌. నేను ఆపడానికి చాలా ట్రై చేశాను సార్‌. కానీ ఆ తలతిక్క పిల్ల ఎవరి మాట వినదని మీకు తెలుసు కదా? సార్‌ అంటూ సంజాయిషీ ఇస్తాడు రాథోడ్‌. అసలు మిస్సమ్మకు తెలియకుండా చేద్దామంటే ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది రాథోడ్‌ అంటూ సరేలే ఇక వెళ్లు అంటాడు.

రాథోడ్‌ కారు ముందుకు వెళ్లి ఆలోచిస్తుంటాడు. అమర్, రామ్మూర్తికి ఫోన్ చేసి అంజలి బర్తుడేకు మంగళను తీసుకుని రేపు ఇంటికి రండి అని చెప్తుంటాడు. లోపలి నుంచి వచ్చిన మిస్సమ్మ రేపు అంజలి బర్తుడేకు మా నాన్నను పిలవండి అని చెప్తుంది. ఆయనతోనే మాట్లాడుతున్నాను మాట్లాడు అంటూ ఫోన్‌ మిస్సమ్మకు ఇస్తాడు అమర్‌. మిస్సమ్మ, రామ్మూర్తితో ఫోన్‌ మాట్లాడి వెంటనే అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది. అక్కడే చూస్తున్న రాథోడ్‌ సిగ్గుపడతాడు. ఆరు మాత్రం ఈర్య్ష పడుతుంది. అమర్‌ షాకింగ్‌ గా అలాగే నిలబడిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Intinti Ramayanam Today Episode: ఆశ్రమంలో అవని పుట్టినరోజు వేడుకలు.. అవని తల్లి ఎవరో తెలిసిపోతుందా?

Gundeninda GudiGantalu Today Episode : సత్యంను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీనా మెడకు చుట్టుకున్న రవి పెళ్లి..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అత్తకోసం పరుగెత్తుకెళ్లిన రాజ్‌ – ఆఖరి కోరిక నెరవేరుస్తానని హామీ

Satyabhama Today Episode: మహదేవయ్యకు నిజం చెప్పిన సత్య.. రేణుక చెప్పిన అబద్దంతో షాకైన సత్య..

Trinayani Serial Today October 11th: ‘త్రినయని’ సీరియల్‌: పంచకమణి ఇవ్వమని గజగండను అడిగిన తిలొత్తమ్మ – రెండు మణులను అమ్మవారి సన్నిధిలో పెడతామన్న నయని

Gundeninda GudiGantalu Today Episode : శృతి కిడ్నాప్ కేసులో సత్యం అరెస్ట్.. బాలుకు నిజం చెప్పిన మీనా..

Big Stories

×