EPAPER

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Bathukamma Celebrations: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు సద్దుల బతుకమ్మ. చివరి రోజున సద్దుల బతుకమ్మను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమైన బతుకమ్మ పండుగ నేటితో ముగియనున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మహిళలు ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బతుకమ్మ సంబరాలే కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో నేడు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ చప్పట్లతో తెలంగాణ మార్మోమోగుతుంది. ఎక్కడ చూసినా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటలే వినిపిస్తున్నాయి.


Also Read: ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మహిళలు ఒక్కొరోజు ఒక్కో విధంగా పోటీపడి మరీ బతుకమ్మను పేర్చుతుంటారు. ప్రతి బతుకమ్మకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలో పలువురు భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి రికార్డును కూడా సృష్టించారు. ఇలాంటి సందర్భం మరొకటి సద్దుల బతుకమ్మ సందర్భంగా చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖచిత్రం వచ్చేలా బతుకమ్మను పేర్చారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఈ విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారని సమాచారం.


ఇదిలా ఉంటే.. బతుకమ్మ పండుగను జరుపుకుంటున్న మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలు అంబరాన్ని అంటే విధంగా సంతోషంగా బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మలో కొలువుదీరే గౌరవమ్మ దేవత రాష్ట్రాన్ని చల్లంగా చూడాలని, బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న మహిళలు ఆనందంగా ఉండేలా జీవించాలంటూ ఆయన వేడుకున్నారు.

Also Read: అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

సద్దుల బతుకమ్మ పండుగ మరునాడు కాక ఆ మరునాడు దసరా పండుగను నిర్వహిస్తుంటారు. ఎల్లుండి దసరా పండుగను నిర్హహించనున్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహిస్తుంటుంది. ఎంగిలిపూల బతుకమ్మ రోజు నుంచి ప్రారంభమై సద్దుల బతుకమ్మవరకు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. మొత్తం 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులపాటు ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తుంచింది. ఈ సంబరాల్లో మహిళలు, మహిళా ఉద్యోగాలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇటు చివరి రోజైన నేడు ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తుంది. ఈ సంబరాల్లో నగర వ్యాప్తంగా ఉన్న మహిళలు భారీగా పాల్గొన్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై ఎక్కడ చూసినా బతుకమ్మలే దర్శనమిస్తున్నాయి. అటు వరంగల్, కరీంనగర్, నల్లగొండ, సంగారెడ్డితోపాటు ప్రధాన ప్రాంతాల్లో కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related News

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

IAS Transfers : త్వరలోనే భారీగా ఐఏఎస్ బదిలీలు ? 16న కొత్త ఆఫీసర్స్ వచ్చేస్తున్నారోచ్ !

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Big Stories

×