EPAPER

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Soundarya.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మహానటి సావిత్రి తర్వాత దొరికిన ఏకైక ఆణిముత్యం సౌందర్య (Soundarya )అని చెప్పడంలో సందేహం లేదు. హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈమె గ్లామర్ ప్రపంచంలో కూడా గ్లామర్ వలకబోయకుండానే తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవిని మొదలుకొని వెంకటేష్, నాగార్జున ఇలా ఎంతోమంది హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ. నేడు మన మధ్య లేకపోయినా ఆమె చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.


కర్ణాటకలో పుట్టి ఆంధ్రాలో గుర్తింపు..

కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య ఎంత అందంగా ఉంటుందో ఆమె నటన అంతకుమించి అందంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఉమెన్ పాత్రలతో భారీగా మెప్పించిన దశాబ్ద కాలం పాటు తెలుగు ఆడియన్స్ ను అలరించింది. పుట్టింది కర్ణాటక అయినా ..పేరు తెచ్చుకుంది మాత్రం తెలుగమ్మాయిగా.. ఇక్కడ ఆడియన్స్ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకుంది. ఈమె తండ్రి సత్యనారాయణ అయ్యర్.. కన్నడలో నిర్మాతగా, రైటర్ గా కూడా రాణించారు. పలు సినిమాలను ఆయన నిర్మించారు కూడా.. తండ్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చిన ఈమె.. ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం ఒక అమ్మాయి కావాలంటే తన కూతురు ఉంది కదా అని సౌందర్యను స్కూల్ నుంచి సెట్ కి తీసుకెళ్లారట. ఆ సమయానికి అసలు సౌందర్యకు సినిమా అంటేనే ఇష్టం లేదు. మొదట్లో తన ఇష్టాన్ని తన తండ్రి గౌరవించలేదని తన తండ్రితో మాట్లాడమే మానేసిన ఈమె.. ఆ తర్వాత వేరే ప్రత్యామ్నాయం లేక నటిగా మారాల్సి వచ్చింది.


తండ్రి మరణం కృంగదీసింది..

అసలు ప్రయారిటీనే లేని పాత్రలో నటించిన ఈమె.. ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో చదువు కూడా పక్కనపెట్టి సినిమాల్లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చదువును పూర్తిగా వదిలేసింది కూడా.. తెలుగులో ఎంట్రీ ఇవ్వడంతోనే కెరియర్ పూర్తిగా మారిపోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్ళింది. అలా కెరియర్ పీక్స్ లో ఉండగానే తండ్రి మరణించాడు. ఈ క్రమంలోనే తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకున్న ఈమె నిర్మాతగా మారింది. నాన్న పేరుతోనే బ్యానర్ ని కూడా లాంచ్ చేసింది.

నిర్మాతగా మారిన సౌందర్య.

సత్యం మూవీ మేకర్స్ పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, 2002లో ద్వీప అనే సినిమాను కన్నడలో తెరకెక్కించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్ గా తెరకెక్కించారు. ఇందులో సౌందర్య లీడ్ రోల్ పోషించారు. పేదల జీవితాలను ఆవిష్కరించే కథాంశంతో వచ్చిన ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ పర్వాలేదు అనిపించుకుంది. విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అలా నిర్మాతగా మారి తండ్రికి ట్రిబ్యూట్ ఇచ్చింది. అంతేకాదు ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె నిర్మాతగా పనిచేయలేదు.

Related News

Martin Movie Review : మార్టిన్ మూవీ రివ్యూ…

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!

Big Stories

×