EPAPER

Vultures: రాబందులు చనిపోతే.. మనిషి పరిస్థితి అంతే!

Vultures: రాబందులు చనిపోతే.. మనిషి పరిస్థితి అంతే!

Vulture Decline In India linked To Human Health Crisis: ఈ మధ్యకాలంలో మీరు రాబందులను చూశారా? కచ్చింతంగా చూసి ఉండరు. ఎందుకంటే. దేశంలో సుమారు 98 శాతం అంతరించిపోయాయి. ఈ కారణంగా 2000 నుంచి 2005 మధ్య కాలంలో ఏడాది లక్ష మందికిపైగా జనాలు కొన్ని వైరస్ ఇన్షెక్షన్లతో చనిపోయారని నివేదికలు చెప్తున్నాయి. వినడానికి షాకింగ్ గా ఉన్నా ముమ్మాటికీ నిజం. రాబందులు అంతరించి పోతే మనుషులు ఎందుకు చనిపోతున్నారు? కలేబరాలను పీక్కుతినే ఈ పక్షులు మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి ఎలా కాపాడుతాయి? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే..


రాబందులు స్కావెంజర్లుగా పని చేస్తుంటాయి. చనిపోయిన జంతువులను తింటాయి. అంటే, చనిపోయిన జంతువుల శరీరంలోని బ్యాక్టీరియాలు, పాథోజెన్లు వ్యాపించకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ రాబందులు లేకపోయే చనిపోయిన జంతు కళేబరాలు కుళ్లి, వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయంటోంది సైన్స్.

98 శాతం రాబందులు మాయం


మనదేశంలో ఒకప్పుడు ఒకప్పుడు రాబందులు పెద్ద సంఖ్యలో కనిపించేవి. చనిపోయిన పశువుల కళేబరాల కోసం వెతుకుతూ, ఆకాశంలో ఎగురుతూ ఉండేవి. కానీ, గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో రాబందుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 1990లో 5 కోట్లు రాబందులు ఉండేవి. ఇప్పుడు 98 శాతం చనిపోయాయి. దానికి కారణం పనుశులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వాడే మందులు. నాన్-స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్‌  రాబందులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఈ ఇంజెక్షన్లు వేసుకున్న పశువుల కళేబరాలను తిన్న రాబందులు కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పశువులకు డైక్లోఫెనాక్ వాడకాన్ని ఆపేయాలని 2006లో నిర్ణయం తీసుకున్న తర్వాత రాబందుల మరణాలు తగ్గాయి. కానీ, ఇప్పటికే రాబందుల సంఖ్య నూటికి 98 శాతం తగ్గిపోయాయి.

భారీగా ప్రాణ, ఆర్థిక నష్టం

రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల పశువుల కళేబరాల నుంచి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు విస్తరించి, జనాలకు ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నట్లు అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ జర్నల్‌ వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2005 మధ్యకాలంలో భారత్ లో ఏడాదికి లక్ష మందికి పైగా జనాలు వైరల్ ఇన్షెక్షన్స్ తో చనిపోయినట్లు వెల్లడించింది. సో, రాబందులు లేకపోవడం వల్ల మనిషి మనుగకే తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. రాబందుల సంఖ్య తగ్గిపోయిన తర్వాత మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మనుషుల మరణాల సంఖ్య 4 శాతానికి పైగా పెరిగినట్లు పరిశోధకులు చెప్తున్నారు. ప్రతి ఏటా ఇన్పెక్షన్లతో చనిపోవడానికి కారణం రాబందులు లేకపోవడమేనని వెల్లడించారు. రాబందులు లేకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 5 లక్షల 77 వేల 754 కోట్ల నష్టం వాటిల్లినట్లు   చెప్పారు.

ఉన్న రాబందులను కాపాడుకోక తప్పదు!

రాబందుల సంఖ్య తగ్గిపోవడం వల్ల జంతు కళేబరాలు ఎక్కడపడితే అక్కడ పడేయడంతో మనం తాగే నీళ్లలో  పాథోజెన్లు, బ్యాక్టీరియాలు కలిసి మానవమనుగడకు ముప్పుగా మారాయి. రాబందులు చనిపోవడానికి  పశువులకు ఉపయోగించే ప్రమాదకర ఇంజెక్షన్లు మాత్రమే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అడవులు తగ్గిపోవడం, వన్యప్రాణుల వేట, ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా జీవించలేకపోతున్నాయి. దాని ప్రభావం మనుషుల మీద పడుతున్నది. ఒకప్పుడు దక్షిణభారత దేశంలో 300కి పైగా రాబందులు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉన్నవాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే మానవ మనుగడకు మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.

Read Also:

Related News

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Big Stories

×