EPAPER

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Ratan Tata News: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా మరణంతో, ఆయన తరుపరి వారసుడు ఎవరు? అనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా సన్స్ ను నడిపించే సమర్థుడు ఎవరు? అనే వార్తలు ఊపందుకున్నాయి. కంపెనీకి ఇకపై దశ దిశ చూపించే వ్యక్తి ఎవరు? అవుతారోనని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యాపార సంస్థలతోనే కాదు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో రతన్ టాటా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతటి మహా మనిషి వారసత్వాన్ని ఏమాత్రం లోటుపాట్లు లేకుండా అదే స్థాయిలో తీసుకుపోయే సరైన వ్యక్తి ఎవరు కావచ్చు? అని దేశ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


రతన్ టాటా కుటుంబ గురించి..

రతన్ టాటా మరణం తర్వాత ఆయన కుటుంబ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయన వంశవృక్షం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే, రతన్ టాటా తదుపరి వారసుడు ఆయన కుటుంబం సభ్యులలో ఒకరు కానున్నారు. రతన్ టాటా తల్లిదండ్రులు నవాల్ టాటా-సోనీ. వీళ్లిద్దరు కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. నావల్ టాటా ఆ తర్వాత సిమోన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన కొడుకులలో ఒకరు నోయెల్ టాటా. రతన్ టాటాకు పెళ్లి కాకపోవడంతో పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో రతన్ టాటా కోట్లాది రూపాయల సంపద అతడి సవతి సోదరుడు నోయెల్ టాటా ఫ్యామిలీకి దక్కే అవకాశం ఉంది. నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు లియో టాటా, మరొకరు మాయా టాటా,  ఇంకొకరు నెవిల్లే టాటా. ఈ ముగ్గురిలో ఒకరు టాటా సన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకోనున్నారు.


ముగ్గురు టాటాల్లో ఎవరి ప్రత్యేకత ఏంటంటే?

1.లియా టాటా  

లియా టాటా వయస్సు 39 ఏండ్లు. ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్‌ హోటల్స్ బాధ్యతలను చూసుకుంటున్నది.  స్పెయిన్‌ IE బిజినెస్ స్కూల్‌ లో డిగ్రీ తీసుకుంది. గతంలో తాజ్ హోటల్స్‌ బిజినెస్‌ చూసుకున్నది. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆమె ఫోకస్ అంతా టాటా హోటల్స్ మీదే ఉంది.

2.మాయా టాటా

మాయా వయసు 34 ఏండ్లు. బేయెస్ బిజినెస్ స్కూల్, వార్విక్ యూనివర్సిటీ నుంచి పట్టాలు అందుకుంది. టాటా ఆపర్చునిటీ ఫండ్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత టాటా డిజిటల్ లోకి అడుగు పెట్టారు. టాటా న్యూ యాప్ డెవలపింగ్, లాంచ్ లో కీ రోల్ పోషించారు. ప్రస్తుతం ఆమె టాటా మెడికల్ ట్రస్ట్ బోర్డులో పని చేస్తున్నారు. మాయా తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మెన్ సైరస్ మిస్ట్రీ సోదరి. దివంగత బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ కూతురు.

3.నెవిల్లే టాటా

మాయా టాటా సోదరుడే నెవిల్లే టాటా. అతడి వయసు 32 ఏండ్లు. టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను పెళ్లి చేసుకున్నారు.ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌ ను నెవిల్లే లీడ్ చేస్తున్నారు. అంతేకాదు, ప్యాకేజ్డ్ ఫుడ్, బెవరేజ్ విభాగం బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. జూడియో, వెస్ట్‌ సైడ్‌ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. టాటా వారసుడు ఈయనే టాక్ నడుస్తోంది.

Read Also: వీడ్కోలు నేస్తమా.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్

Related News

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

EPFO monthly pension: నెలజీతం రూ.15000 ఉన్నా.. పెన్షన్ రూ.10000 పొందొచ్చు.. ఎలాగంటే..

Railway Rules: పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే ట్రైన్ లో బెర్త్ ఇస్తారా? ఏ వయసు వరకు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు?

Railway Rules: మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఏసీలో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?

Train Ticket Booking: దీపావళికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? ట్రైన్ టికెట్లు సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Railway Rules: టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Big Stories

×