EPAPER

Konda Surekha : మంత్రి కొండా సురేఖను చుట్టుముడుతున్న కేసులు… అటు నాగార్జున, ఇటు కేటీఆర్

Konda Surekha : మంత్రి కొండా సురేఖను చుట్టుముడుతున్న కేసులు… అటు నాగార్జున, ఇటు కేటీఆర్

Minister Konda Surekha Faces Nagarjuna and Ktr Defamation Cases : మంత్రి కొండా సురేఖను కోర్టు కేసులు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు నాగార్జున ఇప్పటికే నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. మరోవైపు తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కేసు వేశారు. దీంతో మంత్రి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోనున్నారు. మంత్రిపై నాగార్జున దాదాపు రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం గమనార్హం. ఇక కేటీఆర్ సైతం మరో రూ.100 కోట్లకు దావా వేసినట్లు సమాచారం. దీంతో సదరు మంత్రి దాదాపుగా రూ.200 కోట్ల మేర డెఫమేషన్ సూట్ ఎదుర్కొనున్నారు.


రాజకీయ విమర్శల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మంత్రి కొండా సురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్, ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఒకే కేసులో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల నుంచి కొండా సురేఖ కేసులను ఎదుర్కోనున్నారు. ఇందులో ఒకరు సినీ ప్రముఖులు కాగా మరొకరు రాజకీయ ప్రముఖులు.

తన కుమారుడు అక్కినేని నాగచైతన్య – సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారని నాగార్జున గతవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. తమ కుటుంబం పరువు ప్రతిష్టతలకు భంగం కలిగించారని ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో నాగార్జున పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.


సురేఖకు కోర్టు నోటీసులు :

సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ పార్టీ వాళ్లు తనను ట్రోల్‌ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల పేర్లను ఆమె ప్రస్తావించారు. ఇందులో భాగంగా సమంత, నాగచైతన్య విడాకుల అంశంలో నాగార్జున, కేటీఆర్ పాత్ర అంటూ వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడారు.

ఒకదశలో ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు మంత్రి సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో వెనక్కి తగ్గిన మంత్రి, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.  తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల బీఆర్ఎస్ ఆగ్రనేత చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనన్న మంత్రి, సమంత మనోభావాలను దెబ్బతీయడం మాత్రం కాదని క్లారిటీ ఇచ్చేశారు. సమంత, స్వయంశక్తితో ఎదిగిన తీరు తనకు ఆదర్శమని మంత్రి సురేఖ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న తమపై మంత్రి వ్యాఖ్యలు తీవ్రంగా బాధపెట్టాయని పేర్కొన్న అక్కినేని నాగార్జున, నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

Related News

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ

CM Revanth: అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: థాంక్యూ.. సీఎం సార్: బీసీ సంఘాల నేతలు

CM Revanth Reddy: ఆదాయ మార్గాలపై ఫోకస్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×