EPAPER

Ratan Tata : భరతమాత ముద్దుబిడ్డకు భారతరత్న కోరుతూ మహా మంత్రిమండలి తీర్మానం

Ratan Tata : భరతమాత ముద్దుబిడ్డకు భారతరత్న కోరుతూ మహా మంత్రిమండలి తీర్మానం

Maha government passed resolution for seeking Bharat ratna to Ratan Tata : భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, భూరి విరాళాలు అందించే నిలువెత్తు మానవతావాది, భరతమాత ముద్దు బిడ్డ, దేశానికి విలువైన సేవలు అందించిన రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. అనంతరం దాని ప్రతులను కేంద్రానికి అందించింది.


సమాజ సంక్షేమాన్ని ఆశించే వ్యక్తిగా రతన్ టాటాను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. భారీ పరిశ్రమలను స్థాపించి దేశాభివృద్ధిని పరుగులు పెట్టించిన టాటా, దేశ భక్తిని చాటి చాటడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని తీర్మానం ప్రశంసించింది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసిన పారిశ్రామికవేత్తగా ఆయనను అభివర్ణించింది.

సమాన ఆలోచనలు కలిగిన సామాజిక కార్యకర్త, దూరదృష్టి గల నాయకుడ్ని  కోల్పోయామని మహారాష్ట్ర మంత్రి మండలి వివరించింది. పారిశ్రామిక రంగంతో పాటు సామాజిక అభివృద్ధిలోనూ టాటా కృషి అసాధారణమైందని పేర్కొంటూ ఆయన్ను స్మరించారు.


భారతమాత అక్కున చేర్చుకున్న మహారాష్ట బిడ్డ స్వీయ క్రమశిక్షణ, సమర్థమైన పరిపాలన, ఉన్నతమైన నైతిక విలువలతో ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడింది. కఠినమైన పరీక్షలను ఎదుర్కొని టాటా సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని వేనోళ్ల కీర్తించింది.

రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు…

Related News

Shantanu Naidu: రతన్ టాటా భుజం మీద చేయి వేసిన శంతను నాయుడు.. ఈయన వయసు తెలిస్తే షాక్ అవుతారు

Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం పదవిపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌ సపోర్ట్‌ లేకుండానే!

Ratan Tata: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి.. అంతిమయాత్రలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ప్రముఖులు వీళ్లే

Jammu & Kashmir CM : ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా… సీఎంగా ముహుర్తం ఖరారు

Ratan Funeral last rites live updates: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర

Piyush Goyal: రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..

Big Stories

×