EPAPER

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Woman Lands Plane| విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు చిన్న సమస్య వచ్చినా అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇటీవల ఇదే సమస్య ఒక 69 ఏళ్ల మహిళకు వచ్చింది. అయితే విమానంలో ఆమెతో పాటు ఆమె భర్త మాత్రమే ఉన్నారు. దంపతులిద్దరూ ఆకాశంలో విహరిస్తూ ఉండగా.. అనుకోకుండా విమానం నడుపుతున్న ఆమె భర్తకు గుండె పోటు వచ్చింది. దీంతో విమానం నడిపే బాధ్యత ఆ మహిళపై పడింది. కానీ ఆమె ఇంతకుముందు ఎప్పుడూ విమానం నడపలేదు. ఈ ఘటన అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లాస్ వెగాస్ రాష్రానికి చెందిన వోన్ కినాన్ వెల్స్ అనే 69 ఏళ్ల మహిళ తన భర్త ఎలియట్ ఆల్పర్ (78)తో నివసిస్తోంది. ఎలియట్ ఆల్పర్ వందలాది ఆస్తికి యజమాని. అయితే అతనికి విమానం నడపడం ఒక సరదా. అందుకే ఒక కొత్త విమానం కోనుగోలు చేశాక.. తన భార్యను తీసుకొని సరదాగా లాస్ వెగాస్ నుంచి క్యాలిఫోర్నియాకు బయలుదేరాడు. క్యాలిఫోర్నియకు విమానం ద్వారా చేరుకోవాలంటే గంటకు పైగా సమయం పడుతుంది.

విమానంలో బయలుదేరిన కాసేపు తరువాత ఎలియట్ ఆల్పర్ కు అనుకోకుండా ఛాతిలో నొప్పి వచ్చింది. తన భార్య వోన్ కు ఈ సమస్య గురించి చెప్పాడు. కానీ వోన్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇంతలోనే ఎలియట్ తనకు నొప్పి తీవ్రమైందని చెబుతూ కుప్పకూలిపోయాడు. అది చూసిన వోన్ తన భర్తను ఎంత లేపడానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయేసరికి ఆమెకు ఏం చేయాలో తోచలేదు.


Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

అప్పుడు విమానం ఆకాశంలో 5900 అడుగుల ఎత్తులో ఉంది. క్రమంగా విమానం భూమి వైపుకు దూసుకుపోతోంది. వోన్ ఇంతకుముందు ఎప్పుడూ విమానం నడపలేదు. కానీ పరిస్థితులు చూసి ఇక తాను చనిపోతానేమోనని భయపడిపోయింది. అయితే తన భర్త మాట్లాడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేడియోను చూసింది. వెంటనే దాని ద్వారా ఎయిర్ ట్రాఫిక్ అధికారులకు సమాచారం అందించింది. తన భర్తకు గుండె పోటు వచ్చిందని చెప్పింది. అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ అధికారులు ఆమె విమానం లోకేషన్ ట్రేస్ చేసి సమీపంలోని బేకర్స్‌ఫీల్డ్స్ మెడోస్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ లో విమానం ల్యాండ్ చేయాలని సూచించారు.

అలా ఎయిర్ ట్రాఫిక్ అధికారులు సూచినలు చేస్తూ ఉండగా.. వోన్ క్రమంగా విమానాన్ని ఎయిర్ పోర్ట్ వరకు తీసుకువచ్చింది. కానీ ల్యాండింగ్ ఎలా చేయాలో ఆమెకు అర్థం కాలేదు. దీంతో ఇక విమానం క్రాష్ అయిపోతుందేమోనని అధికారులు భయపడ్డారు. కానీ వోన్ ధైర్యం, ఓర్పుతో విమానం ల్యాండింగ్ గేర్ ని మెల్లగా ఉపయోగించింది. అయినా విమానం చిన్నగా క్రాష్ అయింది. ఎలాగోలా విమానం కిందకు దిగగానే ఎయిర్ పోర్ట్ ఎమర్జెన్సీ భద్రతా సిబ్బంది వెంటనే వోన్, ఆమె భర్తను ఆస్పత్రికి తరలించారు. కానీ వోన్ భర్త ఎలియట్ అప్పటికే మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు.

ఇలాంటిదే మరో ఘటన టర్కీ ఎయిర్ లైన్స్ ప్యాసింజ్ విమానంలో జరిగింది. టర్కీ విమానం అమెరికాలోని సియాటిల్ నుంచి ఇస్తాన్ బుల్ బయలుదేరగా.. గాల్లో ఉన్నసమయంలో విమానం పైలట్ కు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో కోపైలట్ చాకచక్యంతో వెంటనే విమానాన్ని న్యూయార్క్ నగరంలో ల్యాండింగ్ చేశాడు. అయితే అప్పటికే 68 ఏళ్ల పైలట్ మరణించాడని ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలిపారు.

Related News

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Omar Bin Laden: లాడెన్ కొడుకుకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్, అసలు ఏం జరిగిందంటే?

TikTok: ‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

Hurricane Milton: : హరికేన్ మిల్టన్.. అంతరిక్షం నుంచి అరుదైన వీడియో, దీన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!

Netanyahu Warns Lebanon: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్

Denmark Driving Rules: డెన్మార్క్ డ్రైవింగ్ రూల్స్.. కారులో అవి లేకపోతే ఫైన్ వేస్తారట, అందుకే అక్కడ యాక్సిడెంట్స్ ఉండవ్!

Big Stories

×