EPAPER

Viswam Movie First Review : విశ్వం మూవీ ఫస్ట్ రివ్యూ… ముగ్గురికి హిట్ వచ్చినట్టేనా…?

Viswam Movie First Review : విశ్వం మూవీ ఫస్ట్ రివ్యూ… ముగ్గురికి హిట్ వచ్చినట్టేనా…?

Viswam Movie First Review.. ఈ ఏడాది దసరా పండుగకు పోటీ పడబోతున్న చిత్రాలలో గోపీచంద్ (Gopichandh ) నటిస్తున్న విశ్వం (Viswam) సినిమా కూడా ఒకటి. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వేణు, దోనెపూడి ప్రభాకర్, టీజీ విశ్వనాథ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వీ.కే.నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి , షకలక శంకర్ , అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన టీజర్ విడుదల చేయగా.. సెప్టెంబర్ 26వ తేదీన ట్రైలర్ విడుదల చేసి, సినిమాపై హైప్ పెంచారు. అక్టోబర్ 11వ తేదీన దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


ఒక్క మూవీపై ఆధారపడ్డ స్టార్స్..

ముఖ్యంగా ఈ సినిమా విజయం ముగ్గురికి అత్యంత తప్పనిసరిగా మారిపోయిందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న హీరో గోపీచంద్ ఏడాది భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. డిజాస్టర్ గా మిగిలాడు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే విజయం అందుకోవాలని పరితపిస్తున్నాడు. మరొకవైపు దశాబ్ద కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల వరుసగా నాలుగు ఫ్లాపుల తర్వాత విశ్వం సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో సక్సెస్ అయితేనే ఆయన దర్శకుడిగా నిలదొక్కుకుంటారు.. లేకపోతే వెనుతిరిగి వెళ్లాల్సిందే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరే కాదు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశ్వం సినిమాతో హిట్ అందుకోవాలని అవసరమైన క్రెడిట్ ని కూడా పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురికి ఈ సినిమా సక్సెస్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పాలి. మరొకవైపు హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతమంది ఒక్క సినిమాపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులు మెప్పిస్తుందా ? లేదా ..? అనేది తెలియాలంటే ఆడియన్స్ ఇస్తున్న ఫస్ట్ రివ్యూ గురించి ఇప్పుడు చూద్దాం.


విశ్వం మూవీ ఫస్ట్ రివ్యూ..

సినిమా రివ్యూ విషయానికి వస్తే. కొంతమంది ఇండస్ట్రీలో ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సినిమాపై తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.. వారి టాక్ ప్రకారం మొదటి 20 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందట..ఆ తర్వాత వచ్చే కామెడీ సన్నివేశాలు, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని , ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ కంటెంట్ కూడా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు శ్రీను వైట్ల బాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గోపీచంద్ కూడా ఇందులో కొత్తగా కనిపిస్తారని సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమాతో వీరు హిట్ కొట్టినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం.

Related News

Hero Ajith: అల్ట్రా స్టైలిష్ లుక్ లో స్టార్ హీరో.. ఏమున్నాడ్రా బాబు..

Akhil Akkineni: అయ్యగారి కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..?

Vettaiyan : వెట్టయాన్‌ వేస్ట్ అయిపోయింది… డైరెక్టర్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది..

Akkineni Nagarjuna: రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన నాగ్.. అంత బాధలోనూ ఆ విషయం అడిగి..?

Balakrishna: సూపర్ హీరోగా మారనున్న బాలయ్య.. రేపే అనౌన్స్మెంట్..!

Nara Rohit Marriage: పెళ్లి కుదిర్చింది ఎవరో తెలుసా.? ఈమె అని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు!

Dil Raju : పాన్ ఇండియా టైటిల్ కష్టాలు… ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Big Stories

×