EPAPER

CM Revanth Reddy Emotional: భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్.. ఆ ఒక్క ట్వీట్ తో అందరినీ.. !

CM Revanth Reddy Emotional: భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్.. ఆ ఒక్క ట్వీట్ తో అందరినీ.. !

CM Revanth Reddy Emotional: తెలంగాణలో ప్రజారంజక పాలన సాగుతున్న వేళ.. నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా అందుతున్న వేళ.. రైతాంగ సంక్షేమం కోసం పాటుపడుతున్న వేళ.. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన వేళ.. సింగరేణి బిడ్డల్లో చెరగని చిరునవ్వులు చూసిన వేళ.. దసరా పండుగకు అక్షరాలు దిద్దించే టీచర్స్ కొలువైన వేళ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎటు చూసినా తెలంగాణ ప్రజల ఆనంద క్షణాలే.. అందుకేనేమో.. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటూ.. ప్రజాదరణ పొందిన ప్రభుత్వంగా గుర్తింపు లభించిన వేళ.. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ కి యావత్ తెలంగాణ జయహో కాంగ్రెస్.. జయహో రేవంత్ అంటూ సంబరపడుతోంది.


సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే.. నిన్న నీ కోసం ఉద్యమించిన చెయ్యి.. నేడు నీ ఉజ్వల భవితను నిర్మించే అభయ హస్తమైంది. నిన్న నీ కోసం ప్రశ్నించిన గొంతుక.. నేడు నీ కొలువుల పండుగై ప్రతిధ్వనిస్తోంది అంటూ తన మనోభవాన్ని వ్యక్తపరిచారు. ఈ ట్వీట్ భావాన్ని ఓసారి చూస్తే.. నిన్న తెలంగాణ ప్రజల కోసం ఉద్యమించింది కాంగ్రెస్ హస్తం. నేడు ప్రజలందరి భవిష్యత్ కోసం పాటుపడుతూ.. అభయహస్తం అందిస్తోందని, మీ కోసం నాడు ప్రశ్నించిన మా గొంతుక.. నేడు నిరుద్యోగులకు కొలువులు అందిస్తూ.. దసరా, దీపావళి ముందే వచ్చిందా అన్నట్లుగా కొలువులు ఇచ్చిందని తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి.. తాను హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చేదిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. ప్రభుత్వం గద్దెనెక్కగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, గృహజ్యోతి, అన్ని శాఖల్లో గల ఖాళీల భర్తీ, సింగరేణి కార్మికుల బిడ్డలకు కారుణ్య నియామకాలు, డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11,062 మందికి నియామక పత్రాలు, ఇందిరమ్మ ఇళ్లు, స్టాఫ్ నర్సింగ్ , ఇలా ప్రతి నెలా ఏదో ఒక కొలువుల భర్తీ సాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

Also Read: Ratan Tata’s Top Secret: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల ఊసే లేని రోజులు ఎదుర్కొన్నామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుల జాతర ప్రకటించి.. ఇచ్చినా.. ఇవ్వని గ్యారంటీలను అమలు చేస్తోందంటూ నిరుద్యోగ యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదేళ్లు ఉద్యమించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమానికి పాటుపడడంలో ఎక్కడా వెనక్కు తగ్గకుండా.. భావి భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రజానీకం సైతం వెంట ఉండి ప్రోత్సహిస్తోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే రేవంత్ ట్వీట్ కి.. సీఎం సార్.. వుయ్ ఆర్ ఆల్ విత్ యు అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు.

Related News

Konda Surekha : మంత్రి కొండా సురేఖను చుట్టుముడుతున్న కేసులు… అటు నాగార్జున, ఇటు కేటీఆర్

CM Revanth Reddy: మా ఊరి బిడ్డ వస్తున్నాడయ్యా.. దసరాకు స్వగ్రామానికి వెళుతున్న సీఎం రేవంత్.. గ్రాండ్ వెల్ కమ్ కి అంతా సిద్దం

Konda Surekha: నాగార్జున కేసులో మంత్రి సురేఖకు నోటీసులు.. ఇక కేటీఆర్ కూడా.. ?

Ponnam Prabhakar: ప్లీజ్.. దయచేసి ఆ పని చేయవద్దన్న మంత్రి పొన్నం

Saddula bathukamma: నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంకుబండ్‌పై స్పెషల్ లేజర్ షో

Hyderabad Race Course Club: ఫ్యూచర్ సిటీకి రేస్ కోర్స్.. మంతనాలు కొలిక్కి వచ్చేనట్టే?

Big Stories

×