EPAPER

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Nepal Teen Climbs Mountains| నేపాల్‌ దేశానికి చెందిన ఒక 18 ఏళ్ల కుర్రాడు ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించాడు. ప్రపంచంలో 8000 మీటర్లు అంతకంటే ఎత్తు ఉన్న 14 పర్వతాలపై ఎక్కిన అతి తక్కువ వయసు గల వ్యక్తిగా నేపాల్ కు చెందిన నీమా రిన్జీ షేర్పా రికార్డు సృష్టించాడు.


బుధవారం, అక్టోబర్ 9, 2024న నీమీ రిన్జీ షేర్పా టిబెట్ లోని షిషా పంగ్మా పర్వాతాన్ని అధిరోహించి తన రికార్డుని పూర్తి చేశాడు. టిబెట్ లోని షిషా పంగ్మా పర్వతం ఎత్తు 8027 అడుగులు ఉంది. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలలో ఇది ఒకటి కావడం విశేషం. నీమా షేర్పా ఈ రికార్డు సాధించడంతో అతని తండ్రి మీడియాతో మాట్లాడారు. ”నా కొడుకు పర్వతాలు ఎక్కడంలో మంచి శిక్షణ తీసుకున్నాడు. అతను సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది.” అని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీమా షేర్పా కంటే ముందు 2019లో 30 ఏళ్ల మింగ్మా గ్యాబు, డేవిడ్ షేర్పా అనే నేపాలి వ్యక్తి ప్రపంచలోని అన్ని ఎత్తైన పర్వతాలు అధిరోహించాడు.

పర్వతాలు అధిరోహించే వారందరూ ఈ రికార్డ్ సాధించాలని కోరుకుంటారు. ఈ 14 ఎత్తైన పర్వతాలను ఎయిట్ థౌజెండర్స్ అని అంటారు. ఈ పర్వతాలపై ప్రమాదకర డెత్ జోన్స్ ఉన్నాయి. అక్కడ ప్రాణవాయువు ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మానువులు అక్కడికి వెళితే ఊపిరాడక చనిపోయే అవకాశాలు ఎక్కువ.


Also Read: బ్రెడ్ అమ్ముతూ జీవనం సాగించాడు.. డాక్టర్ కావాలని కష్టపడి నీట్ టాప్ ర్యాంక్ సాధించాడు

రికార్డు సాధించిన తరువాత నిమా షేర్పా ఒక ప్రకటన జారీ చేశారు. ”నేను ఈ మహా పర్వతాలు అధిరోహించడం కేవలం నా వ్యక్తిగత ప్రయాణం ఎంత మాత్రం కాదు. ఈ ఎత్తైన పర్వతాలు అధిరోహించాలని ప్రయత్నించే సాహసం చేసిన వారందరికీ ఇదేనా ట్రిబూట్. పర్వతాలు ఎక్కడం కేవలం శ్రమతో కూడుకున్న పని మాత్రమే కాదు. మన సంకల్ప బలానికి, మనలోని బలానికి, ఓర్పుకి ఒక పరీక్ష.” అని ప్రకటనలో నిమా షేర్పా పేర్కొన్నారు.

నీమా షేర్పాకు పర్వతాలు ఎక్కడం కొత్తేమీ కాదు. నేపాల్ లో అతని కుటుంబం తరతరాలుగా టూరిస్టులకు పర్వతాలు ఎక్కడంలో సాయం చేసే బిజినెస్ చేస్తుంది. ఇప్పటివరకు ఎక్కువ సంఖ్యలో టూరిస్టులకు పర్వతాల పైకి తీసుకెళ్లిన రికార్డ్ కూడా నీమా షేర్పా కుటుంబానికి ఉంది.

అయితే నీమా షేర్పా రేండేళ్ల క్రితం పర్వతాలు ఎక్కే శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆగస్టు 2022లో మౌంట్ మనాస్లుని అధిరోహించాడు. 2024 జూన్ నెలలోనే ప్రపంచంలోన మూడు అతి ఎత్తైన పర్వతం కాంచెన్ జంగా ని నీమా షేర్పా అధిరోహించాడు.

నేపాల్ లోని షేర్పా జాతికి చెందిన వారే ఎక్కువగా పర్వతాలు అధిరోహించే శిక్షణ తీసుకుంటారు. వీరంతా హిమాలయాలు, మౌంట్ ఎవరెస్ట్ పరసర ప్రాంతాల్లో నివసించేవారు. షేర్పాలు పర్వతాలు అధిరోహించే సమయంలో తగిన భోజనం, తాడు, నిచ్చెన అన్ని తమతో తీసుకెళ్తారు. విదేశియులు పర్వతాలు ఎక్కేందుకు వచ్చినప్పుడు ఈ షేర్పా జాతి వాళ్లే వారికి సాయం చేసేందకు వెళ్తారు.

2021లో పర్వతాలు అధిరోహించే ఒక నేపాలి బృందం మొదటి సారి చలికాలంలో ప్రపంచంలోని రెండో అతి ఎత్తైన పర్వతం కె2 ని అధిరోహించారు. ఈ పర్వతం 8611 మీటర్ల ఎత్తులో ఉంది. కె2 పర్వతం పాకిస్తాన్ లో ఉంది.

Related News

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Omar Bin Laden: లాడెన్ కొడుకుకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్, అసలు ఏం జరిగిందంటే?

TikTok: ‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

Hurricane Milton: : హరికేన్ మిల్టన్.. అంతరిక్షం నుంచి అరుదైన వీడియో, దీన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!

Netanyahu Warns Lebanon: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్

Denmark Driving Rules: డెన్మార్క్ డ్రైవింగ్ రూల్స్.. కారులో అవి లేకపోతే ఫైన్ వేస్తారట, అందుకే అక్కడ యాక్సిడెంట్స్ ఉండవ్!

Big Stories

×