EPAPER

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

Airtel Acquire TATA Play| దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ త్వరలోనే టాటా ప్లే డిటిహెచ్ సర్వీస్ ని కొనుగోలు చేయనుందని సమాచారం. ఈ మేరకు టాటా కంపెనీతో ఎయిర్‌టెల్ అధికారులు సమావేశాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ విలీనం జరిగితే.. డిజిటల్ టివి సెక్టార్ లో ఎయిర్‌టెల్ భారీ విస్తరణ సాధిస్తుంది. పైగా నాన్ మొబైల్ వ్యాపారాల ద్వారా ఎయిర్‌టెల్ కు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


ఎంటర్‌టెయిన్మెంట్ రంగం నుంచి తొలగనున్న టాటా గ్రూప్
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. టాటా ప్లే సర్వేస్ ని విక్రయించడం ద్వారా టాటా గ్రూప్ క్రమంగా ఎంటర్‌టెయిన్మెంట్ కంటెంట్ రంగం నుంచి క్రమంగా వైదొలుగుతుంది. టాటా ప్లే నుంచి పెట్టుబడులు ఉపసంహరించేందుకు టాటా సన్స్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 2017లో టాటా కంపెనీ తన కన్జూమర్ మొబిలిటీ బిజినెస్ ని భారతీ ఎయిర్ టెల్ విక్రయించేసింది.

తగ్గిపోతున్న డిటిహెచ్ మార్కెట్
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రవేశంతో దేశంలోని డిటిహెచ్ కేబుల్ సర్వీస్ మార్కెట్ తగ్గిపోతోంది. టైర్ 1, టైర్ 2 పట్టణాలకు చెందిన ప్రజలు ఇంట్లో కూర్చొని కేబుల్ టీవి చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, క్రికెట్ చూడడానికి అలవాటు పడుతున్నారు. ఓటీటీలో ఒక కార్యక్రమం ఎప్పుడైనా చూసే అవకాశం ఉండడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు గ్రామాల్లో ముఖ్యగా ఉత్తర భారతదేశంలో దూరదర్శన్ ఉచిత డిష్ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ మార్పులతో డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్లకు మనుగడ సాధించడం కష్టంగా మారుతోంది.


Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

ఎయిర్‌టెల్ కు టాటా ప్లే లాభదాయకం
ఎంటర్‌టెయిన్మెంట్ రంగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో టాటా ప్లే (అంతకుముదు టాటా స్కై) ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే టాటా ప్లేకి ఉన్న కస్టమర్లు ఎయిర్‌టెల్ బండల్ సర్వీస్ లో విలీనమైతే.. ఎయిర్‌టెల్ కస్టమర్ భారీగా పెరిగే అవకాశముంది.

టాటా ప్లేలో వాల్ట్ డిస్నీ వాటా
టాటా ప్లే సర్వీసులో 70 శాతం వాటా టాటా సన్స్ వద్ద ఉండగా.. వాల్ట్ డిజ్నీ సంస్థ వాటా 30 శాతం ఉంది. ఏప్రిల్ 2024లో టాటా ప్లే బిజినెస్ విలువ 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే కరోనా లాక్ డౌన్ ముందు ఈ విలువ 3 బిలియన్ డాలర్లుగా ఉండేది. కంపెనీ విలువ భారీగా పడిపోవడంతో వాల్ట్ డిజ్నీ కూడా టీవి ఎంటర్‌టెయిన్మెంట్ బిజినెస్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనుకుంటోంది.

ఓటీటీ ఛానెల్స్ ఎక్కువ సంఖ్యలో ఆఫర్ చేస్తున్న జియో ఫైబర్ తో పోటీపడేందుకు టాటా ప్లే సర్వీస్ ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విలీనం కోసం డీల్ చర్చలు కొన్ని వారాలుగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఎయిర్‌టెల్ ఈ అంశంపై అధికారికంటా ప్రకటించే అవకాశం ఉంది.

Related News

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

EPFO monthly pension: నెలజీతం రూ.15000 ఉన్నా.. పెన్షన్ రూ.10000 పొందొచ్చు.. ఎలాగంటే..

Railway Rules: పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే ట్రైన్ లో బెర్త్ ఇస్తారా? ఏ వయసు వరకు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు?

Railway Rules: మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఏసీలో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?

Train Ticket Booking: దీపావళికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? ట్రైన్ టికెట్లు సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Railway Rules: టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Big Stories

×