EPAPER

Ponnam Prabhakar: ప్లీజ్.. దయచేసి ఆ పని చేయవద్దన్న మంత్రి పొన్నం

Ponnam Prabhakar: ప్లీజ్.. దయచేసి ఆ పని చేయవద్దన్న మంత్రి పొన్నం

Ponnam Prabhakar: వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయా? దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయా? ప్రభుత్వాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎందుకు అలర్ట్ చేస్తున్నాయి? అసలేం జరుగుతోంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే..


వాహనాదారులకు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి అలర్ట్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. దయచేసి మద్యం తాగి వాహనం నడపొద్దు, అది ప్రమాదానికి సూచిక చెప్పుకొచ్చారు.

బతుకమ్మ, దసరా ఫెస్టివల్ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ చిన్న వీడియో సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా సగటున ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు. కేవలం తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.


చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ద‌స‌రా రోజు కుటుంబ సభ్యులందరం ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు మంత్రి పొన్నం. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం. దయచేసి మద్యం తాగి వాహనం నడపొద్దు.. అది ప్రమాదానికి సూచిక చెప్పుకొచ్చారు సదరు మంత్రి.

ALSO READ: నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంకుబండ్‌పై స్పెషల్ లేజర్ షో

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతూ వస్తోంది. 2022 కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారం లక్షా 68 వేల మంది మరణించినట్టు తేలింది. అందులో ఓవర్ స్పీడ్ వల్ల లక్షా 20 వేల మంది ఈ లోకాన్ని వదిలిపెట్టారు.

ఇక డ్రగ్స్, డ్రంకెన్ డ్రైవ్ బారిన పడి 4 వేల మంది మరణించారు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల 9 వేలు మంది, రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్ సమయంలో 1400 మంది, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ దాదాపు 3,400, మిగతా కారణాల వల్ల 30 వేల మంది మృత్యువాత పడినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

లాక్‌డౌన్ కారణంగా ఒక్క 2020లో మరణాలు రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2018లో 1 లక్షా 57 వేల మంది, 2019లో ఒక లక్షా 58 వేల మంది, 2020- ఒక లక్షా 38 వేలు, 2021లో లక్షా 54 వేలు (దాదాపు), 2022లో లక్షా 68 వేల మంది మరణించినట్టు తేలింది.

రెండువారాల కిందట మంత్రి పొన్నం ట్రాన్స్‌పోర్టు శాఖపై రివ్యూ చేశారు. రోడ్డు నిబంధనలు పాటించనివారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారిపై అవసరమైతే లైసెన్సులు సైతం రద్దు చేయాలని కోరిన విషయం తెల్సిందే.

 

Related News

Konda Surekha: నాగార్జున కేసులో మంత్రి సురేఖకు నోటీసులు.. ఇక కేటీఆర్ కూడా.. ?

CM Revanth Reddy Emotional: భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్.. ఆ ఒక్క ట్వీట్ తో అందరినీ.. !

Saddula bathukamma: నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంకుబండ్‌పై స్పెషల్ లేజర్ షో

Hyderabad Race Course Club: ఫ్యూచర్ సిటీకి రేస్ కోర్స్.. మంతనాలు కొలిక్కి వచ్చేనట్టే?

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..

Big Stories

×