EPAPER

Naga Chaitanya: నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా వుందా.. అసలు ఊహించలేదే..!

Naga Chaitanya: నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా వుందా.. అసలు ఊహించలేదే..!

Naga Chaitanya.. అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య (Naga Chaitanya) తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ రేంజ్ లో సక్సెస్ అయితే కాలేదని చెప్పాలి. ప్రస్తుతం టైర్ 2 హీరోగా సెటిల్ అయిపోయారు నాగచైతన్య. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన పలు షాకింగ్ విషయాలలో అక్కినేని కుటుంబం కాంట్రవర్సీ పెను దుమారాన్ని రేపింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ కోసం ఒక పరువు నష్టం మాత్రమే కాదు అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య రెండో పెళ్లి కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


పదే పదే వార్తల్లో నిలుస్తున్న అక్కినేని ఫ్యామిలీ..

ఈ నేపథ్యంలోనే అక్కినేని కుటుంబంతోపాటు అక్కినేని మాజీ కోడలు సమంత పేర్లు కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య తన భార్య సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకొని ఆమెతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. మరొకవైపు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో మళ్ళీ అక్కినేని కుటుంబం కోసం నాగచైతన్య, నాగార్జున వార్తల్లో నిలిచారు. ఇలా వీరిపై పలు సంచలన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


₹4,000 తో రూ.50 కోట్లు లాభం..

ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా అక్కినేని నాగచైతన్య తాజాగా చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత ఆశ్చర్యంగా మారిందని చెప్పవచ్చు. నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. తాను ఎప్పుడో 2013 లో బిట్ కాయన్ లో 50 డాలర్స్ పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు అది 6 మిలియన్లకు చేరుకుంది. సో అది గివ్ అవే ఇద్దామనుకుంటున్నాను అసలు మీరేమంటారు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది కాస్త ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ముఖ్యంగా నాగచైతన్య లాంటి నటుడు నుంచి ఇలాంటి పోస్టు రావడం ఒకరకంగా నమ్మే విధంగానే అనిపిస్తోంది అని చెప్పవచ్చు.

నాగచైతన్య పోస్ట్ వైరల్..

అయితే ఇది చూసిన కొంతమంది ఇదేదో తేడాగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే హీరోల కొడుకులు , వారి చదువుల జ్ఞానంతో కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటారు కదా అలా ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టిన వర్చువల్ కరెన్సీ పై ఇన్వెస్ట్ చేశాడు అంటే మనం కూడా నమ్మవచ్చు. ఒక నాగచైతన్యనే కాదు అప్పుడు కొన్న వారు ఇప్పటికీ ఉంచుకొని ఉంటే వారు లాభాలు అందుకునే వారు ఏమో. కాబట్టి నాగచైతన్య పోస్ట్ పెట్టాడు అంటే దీనిని నమ్మవచ్చు అంటూ కామెంట్ చేశారు.

హ్యాకర్స్ పనే ఇదంతా..

అయితే ఇక్కడ మరోవైపు ఆశ్చర్యకరమైన వార్త కూడా వినిపిస్తోంది. నాగచైతన్య ఈ పోస్ట్ పెట్టలేదని, ఆయన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇలాంటి పోస్టు ఆయన నుంచి వచ్చింది అని కూడా అంటున్నారు. మొత్తానికైతే ఇది ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. ఇకపోతే మంచి బిజినెస్ టాలెంట్ ఉందని అందరూ సంబరపడిపోయేలోపే ఇది ఒక హ్యాకర్ చేసింది అంటూ కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏది ఏమైనా 50 డాలర్స్ తో పెట్టుబడి అంటే ఇప్పుడు రేటు ప్రకారం రూ .50 కోట్లను చైతన్య ఈజీగా సంపాదించాడు అని వార్తలు వచ్చేలోపే ఇది హ్యాక్ అయింది అంటూ వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related News

Longest Run Time Movie : ట్రైలరే 72 నిమిషాలు…. లాంగెస్ట్ రన్ టైం ఉన్న సినిమా ఏంటో తెలుసా?

Janaka Aithe Ganaka Movie Review : జనక అయితే గనక మూవీ రివ్యూ

Vettaiyan : రజినీ సినిమాకు హాలిడేస్ ఇచ్చిన కంపెనీలు… కానీ భలే దెబ్బ పడింది

Viswam Movie First Review : విశ్వం మూవీ ఫస్ట్ రివ్యూ… ముగ్గురికి హిట్ వచ్చినట్టేనా…?

Viswam Movie Review : విశ్వం మూవీ రివ్యూ… గోపీచంద్‌కు బ్రేక్ వచ్చినట్టేనా…?

Nagarjuna: పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. కొలిక్కి రానుందా..?

Unstoppable with NBK : తండ్రితో గొడవలు… బన్నీతో షాకింగ్ నిజాన్ని బయట పెట్టించిన బాలయ్య

Big Stories

×