EPAPER

Ratan Tata: రతన్‌ టాటా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Ratan Tata: రతన్‌ టాటా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Celebrities Pays Tribute To Ratan Tata: దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయనను ముంబయిలోని బ్రీచీ క్యాండి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్ అధికారికంగా ప్రకటించింది. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత విషమించడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.


రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలతోపాటు సినీ ప్రముఖులు సైతం నివాళులర్పిస్తున్నారు. ఈ మేరకు తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రతన్ టాటా..1937 డిసెంబర్‌ 28న ముంబైలో జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Also Read: కారు ఓనర్స్ కి టాటా చెప్పిన చివరి మాటలు ఇవే.. మీరు పాటిస్తున్నారా ?


రతన్ టాటా మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపాు. చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రపంచంపై ముద్ర వేసిన అతి కొద్ది మందిలో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్‌ను కోల్పోయిందని, ఆయనలా మరెవ్వరూ ఉండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. వాణిజ్య రంగానికి రతన్ టాటా ఆదర్శమని కేంద్ర మంత్రి సంతాపం తెలిపారు.

అలాగే, రతన్ టాటా మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణానికి టాటా సహకారం అందించారన్నారు. టాటా మృతి చెందడంతో ప్రపంచం శూన్యమైందని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఇది చాలా బాధకరమైన రోజు అని ఎమోషనల్ అయ్యారు. ఆయన భవిష్యత్త్ తరాలకు స్ఫూర్తి అన్నారు.

Related News

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. మరి బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

Ratan Tata Land Rover: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!

Ratan Tata Business Journey: చిన్న ఉద్యోగిగా చేరి.. టాటా కంపెనీకి అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిన రతన్ టాటా!

Ratan Tata’s Top Secret: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

Ratan Tata Last Words: కారు ఓనర్స్ కి టాటా చెప్పిన చివరి మాటలు ఇవే.. మీరు పాటిస్తున్నారా ?

Ratan Tata Simi Garewal : బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

Big Stories

×