EPAPER

Ratan Tata Last Words: కారు ఓనర్స్ కి టాటా చెప్పిన చివరి మాటలు ఇవే.. మీరు పాటిస్తున్నారా ?

Ratan Tata Last Words: కారు ఓనర్స్ కి టాటా చెప్పిన చివరి మాటలు ఇవే.. మీరు పాటిస్తున్నారా ?

Ratan Tata Last Words: టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ఇకలేరు.. ఇకరారు. రతన్ టాటా సాధించిన ఘనతలు అన్నీ, ఇన్నీ కావు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్న తత్వం ఆయన సొంతం. అటువంటి టాటా బాల్యంలో కష్టాలు ఎదుర్కొన్నా.. చదువుకుంటూ తన లక్ష్యం వైపు ముందడుగు వేసి విజయతీరాలను అందుకున్నారు. టాటా బిజినెస్ సక్సెస్ స్టోరీ నేటి యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకాలు.


చిన్నపాటి ఆలోచనతో వ్యాపార రంగాన్ని గడగడలాడించిన రతన్ టాటా (Ratan Tata) గ్రూప్స్ లో .. టాటా మోటార్ కంపెనీ నుండి వచ్చే కార్ల మోడల్స్ కి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్ కి కారణం ప్రతి పనిలో రతన్ టాటా భాగస్వామ్యం కావడమే. నూతన మోడల్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు.. కొనుగోళ్ల వర్షం కురవాల్సిందే. అటువంటి టాటా.. కార్ల యజమానులకు, డ్రైవర్లకు చివరగా ఒక సూచన చేశారు. అది కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపి.. పాటించండి అంటూ కోరడం విశేషం.

రతన్ టాటా (Ratan Tata) కు జంతువులంటే ప్రాణం. జంతువులలో కూడా శునకం అంటే టాటాకు ఎంత ప్రేమో చెప్పాల్సిన పని లేదు. తన సోషల్ మీడియా పేజీల ద్వారా నిరంతరం ప్రజలను జంతువులను ప్రేమించండి అంటూ కోరుతుంటారు. అటువంటి టాటా తన కార్యాలయం బాంబే హౌస్ లో పెంపుడు కుక్కలకు ఓ అంతస్తును కేటాయించారు. అందులో గోవా అనే పేరు గల శునకం అంటే రతన్ టాటాకు ఎంతో ఇష్టం. ఇలా జంతువులపై ప్రేమ గల టాటా.. వాహనదారులకు జంతువుల ప్రాణ రక్షణకై కొన్ని జాగ్రత్తలు సూచించారు.


Also Read: Ratan Tata Love Story: లైఫ్‌లో సూపర్ సక్సెస్.. లవ్‌లో మాత్రం? కన్నీళ్లు పెట్టించే టాటా ప్రేమకథ, అందుకే పెళ్లికి దూరం!

వర్షాకాలంలో నిలువ నీడ లేకుండా ఉండే కొన్ని జంతువులు.. చినుకుల ధాటికి ఎక్కడ ఆశ్రయం పొందాలో తెలియని స్థితిలో ఉంటాయి. ఆ జంతువులు మీ వాహనాల కింద ఆశ్రయం పొందుతాయి. అటువంటి జంతువుల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ టాటా హెచ్చరించారు. వాహనాన్ని పార్కింగ్ చేసిన తర్వాత డ్రైవర్ , ఓనర్ లు ఎట్టి పరిస్థితుల్లో వాహనం కింద చెక్ చేయండి. అలా చేయకుంటే మీరు వాహనం స్టార్ట్ చేస్తే.. ఆ జంతువుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని, ఒక జంతువు ప్రాణం తీయడం కన్నా.. ముందుగా వాహనం కింద చెక్ చేయండి అంటూ సూచించారు. అంటే కార్ల టైర్ల కింద ఎక్కువగా మనకు శునకాలు ఎక్కువగా నిద్రించి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం ఒకసారి చెక్ చేసుకొని.. వాహనం కదిలించాలన్నదే టాటా (Ratan Tata) సూచన.

చివరి వరకు సామాన్య జీవితం గడిపేందుకు ఇష్టపడ్డ రతన్ టాటా (Ratan Tata) తనకు జంతువులపై ఉన్న ప్రేమను ఇలా చాటుకున్నారు. అందుకే ఫ్రెండ్స్.. ప్రాణం తీయడం సులభం.. అదే ప్రాణాన్ని కాపాడడం కష్టం.. రతన్ టాటా చెప్పిన ఈ ఒక్క సూచన మీరు పాటిస్తున్నారా !

Related News

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. మరి బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

Ratan Tata Land Rover: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!

Ratan Tata Business Journey: చిన్న ఉద్యోగిగా చేరి.. టాటా కంపెనీకి అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిన రతన్ టాటా!

Ratan Tata’s Top Secret: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

Ratan Tata: రతన్‌ టాటా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Ratan Tata Simi Garewal : బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

Big Stories

×