EPAPER

Vettaiyan Twitter Review: వేట్ట‌య‌న్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్.. హిట్ కొట్టినట్లేనా?

Vettaiyan Twitter Review: వేట్ట‌య‌న్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్.. హిట్ కొట్టినట్లేనా?

Vettaiyan Twitter Review : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన తాజా చిత్రం వేట్టయన్.. గత ఏడాది వచ్చిన జైలర్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.. ఇక అమితాబ్‌బచ్చన్‌, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.. ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మూవీకి నెటిజన్స్ ట్విట్టర్ ద్వారా ఎలా రెస్పాండ్ అయ్యారో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన‌వేళ్ వేట్ట‌య‌న్ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు నెటిజ‌న్లు చెబుతున్నారు. ఎన్‌కౌంట‌ర్లు చ‌ట్టానికి లోబ‌డే జ‌రుగుతుంటాయా? ఎన్‌ కౌంట‌ర్ల‌ను న్యాయ‌వ్య‌వ‌స్థ స‌మ‌ర్థిస్తుందా? వ్య‌తిరేకిస్తుందా? అనే అంశాల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా లో కాళ్లకు కట్టినట్లు చూపించాడు. సమాజంలో జరుగుతున్న పరిస్థితుల పై ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..

ఈ మూవీ మొదలైన ఇర‌వై నిమిషాలు ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌లా ఉంటుంద‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. ర‌జ‌నీ మాస్ మూమెంట్స్‌, హీరోయిజం, ఎలివేష‌న్స్‌తో ఆరంభ స‌న్నివేశాల‌ను ఆక‌ట్టుకుంటాయ‌ని పేర్కొన్నాడు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ అద‌ర‌గొట్టాడ‌ని, ర‌జ‌నీ డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిమ‌జ్స్ మెప్పిస్తాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ ఆఫ్ అంతగా నచ్చలేదని టాక్ వినిపిస్తుంది.. ఎప్పటిలాగే రజినీకాంత్ పెర్ఫార్మన్స్ అదిరిపోయిందని చెప్పారు.


ఇక రజినీతో పాటుగా అమితాబ్‌బ‌చ్చ‌న్ క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించే సీన్స్ అదుర్స్ అని చెబుతున్నారు. పోలీస్ ఇన్ఫార్మ‌ర్ గా ఫ‌హాద్ ఫాజిల్‌క్యారెక్ట‌ర్‌ ఫ‌న్నీగా ఉంటుంద‌ని, న‌వ్విస్తూనే త‌న యాక్టింగ్‌తో ఫ‌హాద్ ఫాజిల్ ఆక‌ట్టుకుంటాడ‌ని చెబుతున్నారు.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెబుతున్నారు..

ఇక ఈ మూవీ కథ చాలా చిన్నగా ఉందని టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైన‌స్‌గా మారింద‌ని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు చెబుతోన్నారు. స్టోరీ లైన్ బాగుందనే కామెంట్స్ ను అందుకుంది. మ‌న‌సిల్లాయో సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ గెస్ట్ అప్పిరియెన్స్ ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. అనిరుధ్ బీజీఎమ్‌, సాంగ్స్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయ‌ని చెబుతున్నారు..

అందుతున్న టాక్ ప్రకారం ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నట్లు తెలుస్తుంది. జైలర్ తర్వాత రజినీ ఖాతాలో మరో హిట్ పడేలా ఉందని పబ్లిక్ చెబుతున్నారు.. ప్రీ బిజినెస్ కూడా బాగానే జరిగింది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ లను అందుకుంటుందో చూడాలి..

Related News

Nagarjuna: పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. కొలిక్కి రానుందా..?

Unstoppable with NBK : తండ్రితో గొడవలు… బన్నీతో షాకింగ్ నిజాన్ని బయట పెట్టించిన బాలయ్య

Aditya Om : నీకంటే వాళ్లే బెటర్ కదయ్యా.. ఓ హీరో అయి ఉండి మరీ ఇంత నీచమా..?

Ratan TATA: రతన్ టాటా నిర్మించిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఏంటో తెలుసా?

Nara Rohit: పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. వధువు ఎవరంటే..?

Naga Chaitanya: నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా వుందా.. అసలు ఊహించలేదే..!

Big Stories

×