EPAPER

Hyderabad Race Course Club: ఫ్యూచర్ సిటీకి రేస్ కోర్స్.. మంతనాలు కొలిక్కి వచ్చేనట్టే?

Hyderabad Race Course Club: ఫ్యూచర్ సిటీకి రేస్ కోర్స్.. మంతనాలు కొలిక్కి వచ్చేనట్టే?

Hyderabad Race Course Club: మూసీ అభివృద్ధికి వేగంగా పావులు కదుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. మూసీ కాలువ అటు ఇటు ఉండే నిర్మాణాలపై తొలుత దృష్టి పెట్టింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారితో మంతనాలు జరుపుతోంది. మూసీ ఒడ్డునున్న రేస్ కోర్స్‌ను ఫ్యూచర్ సిటీకి తరలించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిపై క్లబ్ ఛైర్మన్ ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


మలక్‌పేట్ రేస్ కోర్స్‌ సుమారు 130 ఎకరాల్లో విస్తరించింది. నిజాం సైన్యానికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు. జాతీయ స్థాయిలో ఇక్కడి రేస్‌కోర్స్‌కు మాంచి గుర్తింపు ఉంది. ఇదికాకుండా పక్కనే మరో 20 ఎకరాల్లో పోలీసుల ట్రైనింగ్ కాలేజీ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం చివర ఉండేది. ప్రస్తుతం సిటీ నడిబొడ్డున ఉంది.

మలక్‌పేట్ రేస్ కోర్స్‌ను ఫ్యూచర్ సిటీకి తరలించాలనే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై క్లబ్ ఛైర్మన్ సురేందర్ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట.


రేపో మాపో దీనిపై నిర్ణయం వెలువడనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు తర్వాత బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట నిర్వాహకులు. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం మలక్‌పేట్ రేస్ కోర్స్‌ను రాజేంద్రనగర్ ప్రాంతానికి తరలించాని భావించింది. అందుకు ప్రతిఫలంగా 200 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ALSO READ: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

మలక్‌పేట్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని స్కెచ్ వేసింది. మరి ఏమైందో తెలీదుగానీ అనుకోకుడా వెనక్కి వెళ్లింది. అప్పటి ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. 2015 రేట్ల ప్రకారం ఎకరం 13 కోట్ల రూపాయలకు పైగానే పలికేది. ఇదంతా అప్పటిమాట.

రేస్ కోర్స్‌ భూములతోపాటు అంబర్‌పేట్‌లోని సిటీ పోలీసు లైన్ క్వార్టర్స్ భూమిని తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఆ భూములను డెవలప్ చేసి వచ్చిన నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలన్నది కొందరు అధికారులు చెబుతున్నమాట.

Related News

Ponnam Prabhakar: ప్లీజ్.. దయచేసి ఆ పని చేయవద్దన్న మంత్రి పొన్నం

Saddula bathukamma: నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంకుబండ్‌పై స్పెషల్ లేజర్ షో

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!

CM Revanth Reddy: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు..

Big Stories

×