EPAPER

Maa Nanna Superhero Movie Review :’మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ

Maa Nanna Superhero Movie Review :’మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ

చిత్రం : మా నాన్న సూపర్ హీరో


నటీనటులు : సుదీర్ బాబు, ఆర్ణా,సాయి చంద్, షాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని తదితరులు

దర్శకుడు : అభిలాష్ రెడ్డి కంకర


సంగీత దర్శకుడు : జై క్రిష్

సినిమాటోగ్రఫీ : జైక్రిష్

నిర్మాతలు : సునీల్‌ బలుసు

నిర్మాణ సంస్థలు : సీఏఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, వి సెల్యులాయిడ్స్‌

Maa Nanna Superhero Movie Rating  : 1.75/5

సినీ కెరీర్ ను ప్రారంభించి దశాబ్దకాలం దాటినా ఇంకా మహేష్ బాబు బావ, కృష్ణ గారి అల్లుడుగా మాత్రమే పిలవబడుతూ వస్తున్నాడు సుధీర్ బాబు. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు కానీ.. సరైన బ్లాక్ బస్టర్ కొట్టలేకపోతున్నాడు. హిట్ టాక్ వచ్చినా సుధీర్ బాబు సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి అతనిది. ఏదేమైనా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. షాయాజీ షిండే, సాయి చంద్..లు అతి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఆర్న హీరోయిన్ గా నటించింది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈరోజు ప్రీమియర్స్ వేశారు మేకర్స్. మరి వాళ్ళ నమ్మకం బలమైనదా? కాదా? సుధీర్ బాబు హిట్టు కొట్టాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :

పుట్టగానే తల్లిని కోల్పోయిన పిల్లడు హీరో(సుధీర్ బాబు). ఇతని తండ్రి ప్ర‌కాష్ (సాయిచంద్‌) లారీ డ్రైవ‌ర్‌ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే తల్లిలేని బిడ్డని బాగా పెంచడానికి తన ఉద్యోగం పర్మినెంట్ కావాలని తాపత్రయపడుతుంటాడు. అయితే 3 రోజుల పాటు అతను లారీ పై వెళ్తాడు. అందులో కాయగూరలు ఉన్నాయని అతన్ని తీసుకువెళ్తారు. కానీ కట్ చేస్తే అందులో గంజాయి ఉంటుంది. అందువల్ల చెక్ పోస్ట్..లో పోలీసులు తనిఖీ చేసినప్పుడు ప్రకాష్ దొరికిపోతాడు. మిగిలిన వాళ్ళు పారిపోతారు. అయితే ప్రకాష్ పనికి వచ్చే ముందు తన బిడ్డని ఓ అనాధ శరణాలయం వారికి ఇచ్చి 3 రోజులు చూడమని కోరతాడు. కానీ ప్రకాష్ అరెస్ట్ అవ్వడంతో అతని పిల్లాడు అనాథ అవుతాడు. దీంతో ఆ పిల్లాడికి జానీ అని పేరు పెడతారు ఆ అనాధ ఆశ్రయానికి చెందినవాళ్లు. మరోపక్క పిల్లలు లేని శ్రీ‌నివాస్‌ (షాయాజీషిండే) తన భార్య(ఆమని) ఒప్పించి ఆ పిల్లాడిని ద‌త్త‌త తీసుకొంటాడు.అయితే జాతి, జాతకం లేని వాడిని తీసుకురావడం వల్ల.. మన కుటుంబానికి అరిష్టం అంటూ శ్రీనివాస్ భార్య.. అతనితో చెబుతూ ఉంటుంది. ఆమె భయపడినట్టుగానే అతని వ్యాపారంలో నష్టాలు వచ్చి ఇంటిని, ఆస్తిని కోల్పోతాడు. అతని భార్య కూడా క్యాన్సర్ భారిన పడి మరణిస్తుంది. దీంతో శ్రీనివాస్.. జానీని దురదృష్టవంతుడిగా చూస్తూ.. అతన్ని దూరంపెడతాడు. అయితే శ్రీనివాస్ చేసిన బిజినెస్ వల్ల.. పెట్టుబడి పెట్టిన రాజకీయ నాయకుడు నష్టపోతాడు. దీంతో శ్రీనివాస్ ని అరెస్ట్ చేయించి.. పోలీసులతో చితక్కొట్టి తన కార్యకర్తని కోల్పోయిన కోటాలో గవర్నమెంట్ నుండి డబ్బు రాబట్టాలని ఓ రాజకీయ నాయకుడు కుట్ర పన్నుతాడు. అతన్ని విడిచిపెట్టాలంటే.. తనకి కోటి రూపాయలు కట్టాలని జానీకి కండిషన్ పెట్టి 20 రోజులు టైం ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

‘లూజర్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన అభిలాష్ కంకర డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కథ పరంగా కొంత కొత్తగా అనిపిస్తుంది. కానీ టేకింగ్ చాలా లేజీగా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ‘హీరో తండ్రి చెప్పినట్టు షేర్స్ లో డబ్బులు పెట్టి నష్టపోయిన ఇంటి ఓనర్ .. తర్వాత హీరో తండ్రిని తిడుతుంటే హీరో ఎంట్రీ ఇచ్చి ‘లాభాలు వస్తే ఇలా ఎదురుతిరుగుతావా.. నష్టాలు పోతే మాత్రం వచ్చి దబాయిస్తున్నావ్’ అంటూ ప్రశ్నిస్తాడు. కానీ ఓ రాజకీయ నాయకుడు అతని తండ్రి వల్ల నష్టపోయాను అని చెప్పి.. పోలీసులతో కలిసి మర్డర్ ప్లాన్ వేస్తే.. వాళ్ళ దగ్గర మాత్రం నోరు మెదపడు. పైగా ఇంకో వ్యక్తి దగ్గర కోటి రూపాయలు కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. ఆడియన్స్ ఈ పాయింట్ దగ్గరే డిస్ కనెక్ట్ అయిపోతాడు. సెకండాఫ్ అయితే చాలా నీరసంగా సాగుతుంది.అలాగని ఫస్ట్ హాఫ్ ఏమీ ఎంటర్టైనింగ్ గా ఉండదు. సెకండాఫ్ చూశాక.. ఫస్ట్ హాఫె బెటర్ అనిపిస్తుంది అంతే..! ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. జయ్ క్రిష్ మ్యూజిక్ కూడా ఓకే.

నటీనటుల విషయానికి వస్తే.. సుధీర్ బాబు ఎప్పటిలానే లుక్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ పెర్ఫార్మన్స్ లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు.ఎప్పటిలానే చాలా ఇబ్బంది పడుతూ నటించాడు. హీరోయిన్ ఆర్న.. హీరోయిన్ పాత్రకి తక్కువ, గెస్ట్ రోల్ కి ఎక్కువ అన్నట్టు ఉంది అంతే.! షాయాజీ షిండే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. సాయి చంద్ పూర్తిగా న్యాయం చేశాడు. ఒకటి రెండు చోట్ల కన్నీళ్లు కూడా పెట్టిస్తాడు. రాజు సుందరం పాత్ర ఎందుకు పెట్టారో.. మేకర్స్ కే తెలియాలి. శశాంక్ బాగానే పెర్ఫార్మ్ చేశాడు. సీనియర్ హీరో వెంకట్ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపదు.

ప్లస్ పాయింట్స్ :

ప్రొడక్షన్ వాల్యూస్

ఫస్ట్ హాఫ్(కొంతవరకు)

 

మైనస్ పాయింట్స్ :

ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం

డైరెక్షన్

సెకండాఫ్

మొత్తంగా ‘మా నాన్న సూపర్ హీరో’ ఎటువంటి ఎమోషనల్ కనెక్ట్ లేని ఓ సదా సీదా బోరింగ్ సినిమా. సుధీర్ బాబు ఖాతాలో ఇంకో ప్లాప్ గా మిగిలిపోతుంది అని చెప్పడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు.

Maa Nanna Superhero Movie Rating  : 1.75/5

Related News

Vettaiyan Movie Review : వెట్టయాన్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

Naga Chaitanya: నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా వుందా.. అసలు ఊహించలేదే..!

Vettaiyan Twitter Review: వేట్ట‌య‌న్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్.. హిట్ కొట్టినట్లేనా?

Janaka Aithe Ganaka OTT : ‘ జనక అయితే గనక ‘ ఓటీటీ డేట్ లీక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Star Hero : గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లో అడ్డంగా బుక్కయిన స్టార్ హీరో.. కానీ చివరిలో ట్విస్ట్..

Dhanush: ధనుష్- ఐశ్వర్య విడాకులు రద్దు.. ఆయన కోసమేనా.. ?

Big Stories

×