EPAPER

Omar Bin Laden: లాడెన్ కొడుకుకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్, అసలు ఏం జరిగిందంటే?

Omar Bin Laden: లాడెన్ కొడుకుకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్, అసలు ఏం జరిగిందంటే?

France Deports Osama Bin Laden’s Son: ఒసామా బిన్ లాడెడ్. ఆధునిక ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అల్ ఖైదా ఉగ్ర సంస్థ అధినేతగా అగ్రరాజ్యం అమెరికాలో రక్తపుటేరులు పారించిన కిరాతకుడు. ట్విన్ టవర్స్ కూల్చి వేసి ప్రపంచాన్ని గడగడలాండించిన నరరూప రాక్షసుడు. పాకిస్తాన్ లోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకున్న అతడిని అమెరికా సైన్యం రాత్రికి రాత్రే మట్టుబెట్టి, శవం కూడా దొరక్కుండా మాయం చేసింది.


ఫ్రాన్స్ లో నివాసం ఉంటున్న లాడెన్ కొడుకు  

ఇక ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం ఒమర్ బిన్ లాడెన్ ఫ్రాన్స్ లో స్థిరపడ్డారు. నార్మాండీ అనే గ్రామంలో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. దాని సాయంతోనే ఓ బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఫ్రాన్స్ లో ఉంటున్నాడు. పెయింటర్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆయనపై ఫ్రాన్స్ దేశ బహిష్కరణ విధించింది. వెంటనే తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు, ఆయనను బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం అతడు చేసిన ఓ ట్వీట్ అంటోంది ఫ్రాన్స్. రీసెంట్ గా ఆయన ఉగ్రవాదానికి మద్దతుగా ఓ ట్వీట్ పెట్టారు. ఉగ్రవాదులు పవిత్ర యుద్ధం చేస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన ఈ ట్వీట్ చేశారు. వెంటనే ఈ విషయం ఫ్రాన్స్ భద్రతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ జరిపారు. ఆయన తమ దేశంలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిర్ణయానికి వచ్చారు. దేశం నుంచి పంపేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అంతర్గత రక్షణ మంత్రి అధికారికంగా వెల్లడించారు.


తన ట్వీట్ పై వివరణ ఇచ్చిన ఒమర్

అటు తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఒమర్ బిన్ లాడెన్ వివరణ ఇచ్చారు. ఎవరో ఆగంతకులు తన ట్విట్టర్ వేదికగా ఉగ్రవాదానికి మద్దతుగా పోస్టు పెట్టారని వెల్లడించారు. తాను ఉగ్రవాదానికి వ్యతిరేకం అని, ప్రస్తుతం తాను హింసకు దూరంగా బతుకుతున్నట్లు తెలిపారు. ఆ పోస్టుకు నాకు సంబంధం లేకపోయినా అప్పటికే ఎక్స్ తన ఖాతాను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. చేయని తప్పుకు తనను బలి చేయడం సరికాదని, ఫ్రాన్స్ అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇంతకీ తనను దేశం నుంచి పంపేశారా? లేదా? అనే విషయంలో క్లారిటీ రాలేదు.

రెండు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదానికి దూరం

ఇక ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదా సంస్థతో ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నో దేశాల్లో మారణ హోమం సృష్టించారు. ఆయనకు సుమారు 20 మందికి పైగా కొడుకులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకడు ఒమర్ బిన్ లాడెన్. ఇతడు కూడా తండ్రితో కలిసి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఉగ్ర శిక్షణ కూడా తీసుకున్నాడు. కారణాలు ఏవో తెలియదు గానీ, 2000 సంవత్సరంలో ఆయన అల్ ఖైదా నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఉగ్రవాదానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నారు.

Read Also:‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

Related News

TikTok: ‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

Hurricane Milton: : హరికేన్ మిల్టన్.. అంతరిక్షం నుంచి అరుదైన వీడియో, దీన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే!

Netanyahu Warns Lebanon: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్

Denmark Driving Rules: డెన్మార్క్ డ్రైవింగ్ రూల్స్.. కారులో అవి లేకపోతే ఫైన్ వేస్తారట, అందుకే అక్కడ యాక్సిడెంట్స్ ఉండవ్!

Telegram Messenger: ‘టెలిగ్రామ్’ అడ్డాగా అలాంటి పనులు.. అమెరికా వార్నింగ్, మరి ఇండియా?

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్

Big Stories

×