EPAPER

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!

Husband Exposed Wife Divya Corruption Money: భార్య అవినీతిని భర్తే బయటపెట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న తన భార్య దివ్య జ్యోతి ప్రతి రోజూ ఇంటికి భారీగా లంచం డబ్బు తెస్తుందని ఆధారాలతో సహ బయటపెట్టిన ఆమె భర్త బయటపెట్టాడు. అంతేకాకుండా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో దండుకున్న డబ్బును తన భార్య ఇంట్లో ఎక్కడెక్కడ దాచిందో చూపిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు


మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపిస్తున్నాయని, ఈ డబ్బు మొత్తం ఆమె తమ్ముడికి పంపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే రూ 1.1 కోట్ల లంచం డబ్బు ఇచ్చినట్లు ఆ ఉద్యోగి భర్త ఆరోపిస్తున్నాడు. తన పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు వారించిన్పటికీ వినడం లేదన్నాడు. దీంతో చేసేదేమి లేక విసుగు చెందిన ఆ భర్త సాక్ష్యాలతో భార్య అవినీతి బండారం బయటపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, ఈ వీడియోలపై అతడి భార్య, మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతి ఖండిస్తున్నాడు. నా భర్త కొన్ని వీడియోలు తీసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెబుతోంది. గతేడాది నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నామని, కోర్టులో విడాకుల కేసు నడుస్తుందన్నారు. ఇప్పుడు ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి మీడియాకు రిలీజ్ చేసి మాట్లాడుతున్నాడని ఆరోపించింది.


Also Read: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు..

మణికొండ నుంచి 30వ తేదీన జీహెచ్ఎంసీకి బదిలీ చేశారని, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నా భర్తతో చాలా విషయాల్లో గొడవలు జరుగుతున్నాయని, కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించింది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

MRPS: మందకృష్ణ మాదిగ అరెస్ట్..

CM Revanth Reddy: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు..

BJP MLA: బడా కబ్జాల సంగతేంటి..? ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్

Minister Ponnam: మీకు కడుపు మంట ఎందుకు..? కేటీఆర్‌కు పొన్నం కౌంటర్

KTR: రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్

Big Stories

×