EPAPER

Pushpa 2 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. బ్రేక్‌ ఈవెన్‌కి ఆ సినిమాను క్రాష్ చేయాల్సిందే..!!

Pushpa 2 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. బ్రేక్‌ ఈవెన్‌కి ఆ సినిమాను క్రాష్ చేయాల్సిందే..!!

Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప 2’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. డిసెంబర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్‌ తో సినిమాను నిర్మించగా, ఇక అంతకు మించి బిజినెస్ అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ మూవీకి దాదాపు రూ. 1000 కోట్ల బిజినెస్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని ఇంకా ఎప్పుడు రిలీజ్ అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా బయ్యర్లు సైతం పుష్ప 2 ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..


గతంలో వచ్చిన పుష్ప 2 మూవీ నేషనల్ వైడ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సుకుమార్ ఈ సినిమాను కూడా అంతకు మించి అనేలా తీశారని జనాలు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే మైత్రి మూవీ మేకర్స్ భారీ ధర చెల్లించేందుకు రెడీగా ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని ఏరియాలు అమ్ముడు పోయాయట. ఆ ఏరియాల్లో చేసిన బిజినెస్‌ని చూస్తే బ్రేక్ ఈవెన్‌ సాధించడానికి బాహుబలి సినిమా కలెక్షన్స్ ను క్రాస్ చెయ్యాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఏ సినిమా కలెక్ట్ చెయ్యని కలెక్షన్స్ ను అందుకుంటేనే ఆ రికార్డ్ సాధ్యం అవుతుందని తెలుస్తుంది.

డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 కి పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. పుష్ప హిందీ వర్షన్‌ వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమా రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేస్తుందని, హిందీ బాక్సాఫీస్ వర్గాల ప్రముఖులు అభిప్రాయం పడుతున్నారు. హిందీలో పుష్ప 2 రూ.250 కోట్లను వసూళ్లు చేయడం ద్వారా రికార్డ్‌ సృష్టించడం ఖాయం అంటూ ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ లో గుసగుసలు వినిపిస్తున్నయి.. మరి ఎంత బిజినెస్ జరుగుతుందో చూడాలి. ఇక ఈ మూవీలో బన్నికి జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఫాహద్‌ ఫసిల్‌, అనసూయ, సునీల్‌ ఇంకా ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తో ఈ సినిమాలో ఐటం సాంగ్‌ చేయించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అక్టోబర్‌ చివరి వారం వరకు మొత్తం షూటింగ్‌ ను పూర్తి చేసి, నవంబర్ రెండో వారానికి మొత్తం పనులు పూర్తి చేసి సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట.. డిసెంబర్‌ 6న విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమాకు మూడో పార్ట్‌ ఉంటుందని ఇప్పటికే యూనిట్‌ సభ్యుల నుంచి క్లారిటీ ఇచ్చేశారు.. పార్ట్ 3 ఎలా ఉండబోతుందో పుష్ప 2 చివర్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..


Related News

Dhanush: ధనుష్- ఐశ్వర్య విడాకులు రద్దు.. ఆయన కోసమేనా.. ?

Samantha: చిన్మయి కూతురితో సమంత.. క్యూట్ వీడియో వైరల్

SSMB29: మహేష్ కాబట్టే కథ లేట్ అయ్యింది.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Vettaiyan The Hunter: తెలుగులో వెట్టయన్ బ్యాన్.. స్పందించిన లైకా

Rajinikanth: 33 ఏళ్ల తర్వాత మరోసారి.. ఎవర్‌గ్రీన్ కాంబో ఈజ్ బ్యాక్

T.P.Madhavan: ప్రముఖ నటుడు టీపీ మాధవన్ మృతి..

Big Stories

×