EPAPER

Saddula Bathukamma 2024: సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ.. విశిష్టత తెలుసా ?

Saddula Bathukamma 2024: సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ.. విశిష్టత తెలుసా ?

Saddula Bathukamma 2024:  రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పూల పండగ బతుకమ్మ పండగను ఊరూరా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. తీరొక్క పూలతో 9 రోజులు బతుకమ్మలను పేర్చుతారు. ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతూ పల్లెల్లో పండగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పల్లెల్లన్నీ బతుకమ్మ పండగ సమయంలో కోలాహలంగా మారతాయి.


తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ సందడి పల్లెలు , పట్టణాల్లో కొనసాగుతోంది. ఆటలు, పాటలు ప్రత్యేక పూజలతో బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. బతుకమ్మ ఆడే సమయంలో ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మలు ఒక చోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ ఒకరు బతుకమ్మ పాట పాడుతుంటే అందరూ బతుకమ్మ ఆటలు ఆడతారు. ముఖ్యంగా బతుకమ్మ ఆడే సమయంలో బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనే పాటలు పాడుతుంటారు.

అనంతరం బతుకమ్మలను తలపై పెట్టుకుని దగ్గరలో ఉన్న చెరువులో లేదా కాలువలో జారవిడుస్తారు. ఆ తర్వాత దేవికి సమర్పించిన సత్తుపిండి..మలీద, పెరుగన్నం, పులిహోరలను ఒకరికొకరు పంచుకుని నైవేద్యం తీసుకుంటారు. తొమ్మిదవ రోజు బతుకమ్మ పండగ ముగింపు రోజు. ఈ రోజును సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. బతుకమ్మ ముగింపు రోజు అనేక నైవేద్యాలను సమర్పిస్తారు.


తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుపుకునే పూల పండగ బతుకమ్మ. ఈ ఏడాది అక్టోబర్ 2న ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు కూడా మొదలయ్యాయి. అక్టోబర్ 11న సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ పండగ మొదటి రోజు నుంచి 9 రోజులు బతుకమ్మను పేర్చి ఆటలు ఆడతారు. బతుకమ్మ పండగ సమయంలో 9 రోజులు రకరకాల నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ విశిష్టత:

సద్దుల బతుకమ్మ అన్ని రోజుల బతుకమ్మతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదవ రోజు పేర్చే బతుకమ్మ పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ బతుకమ్మను పేర్చడానికి రకరకాల పూలను వాడతారు. తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, మందారం, బంతితో పాటు అనేక రకాల పూలతో సద్దుల బతుకమ్మను తయారు చేస్తారు. వీటితో వీలైనంత ఎత్తుగా బతుకమ్మను పేర్చుతారు. అంతే కాకుండా పెద్ద బతుకమ్మతో పాటు ఒక చిన్న బతుకమ్మను కూడా తోడు బతుకమ్మగా పేర్చుతారు. పసుపుతో గౌరమ్మను తయారు చేసి చిక్కుడు ఆకులలో పెట్టి చిన్న బతుకమ్మపై పెడతారు.

Also Read: నవరాత్రుల మహా అష్టమి నాడు మహాగౌరీ దేవి పూజా విధానం, మంత్రం, నైవేద్యం వివరాలు ఇవే

ఆ తర్వాత బతుకమ్మను ఇంట్లో ఒక చోట పెట్టి పూజించి మలీద ముద్దలు, పులిహోర, సత్తిపిండి, పెరుగన్నంతో పాటు మరి కొన్ని ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి వీదిలోని ఓ చోట పెట్టి  మహిళలు అంతా అక్కడికి చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడతారు. చీకటి పడిన తర్వాత బతుకమ్మను తీసుకెళ్లి చెరువులో జారవిడుస్తారు. ఆ తర్వాత నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుని ఆరగిస్తారు. ఇలా సద్దుల బతుకమ్మ పండగ ముగుస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Sukarma Yog Horoscope: రేపు సుకర్మ యోగంతో ఈ రాశులు ధనవంతులు కాబోతున్నారు

Shardiya Navratri 2024 Day 8: నవరాత్రుల మహా అష్టమి నాడు మహాగౌరీ దేవి పూజా విధానం, మంత్రం, నైవేద్యం వివరాలు ఇవే

Shani Dev Horoscope: అరుదైన నక్షత్రం మార్పు.. 4 రాశుల అదృష్ట చక్రం మారబోతుంది

Maha Shasthi Rashifal: తులా రాశికి ప్రేమ, సింహ రాశికి ప్రతిష్ట.. మహాషష్టితో ఈ రాశులకు అన్నీ మారబోతున్నాయి

Guru Vakri Unlucky Zodiacs: 119 రోజులు పాటు గురు వక్ర రేఖలో 4 రాశులకు ఆర్థిక కష్టాలు!

Budh Nakshatra Parivartan: మరికొద్ది రోజుల్లో రాహు నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం

Big Stories

×