EPAPER

2 Jawans Kidnapped: ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒకరిని చంపేసి…

2 Jawans Kidnapped: ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒకరిని చంపేసి…

Two Jawans Kidnapped in J&K, One Found dead, other Escapes: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులను కిడ్నాప్ చేశారు. అందులో ఒకరిని కాల్చి చంపారు. ఈ ఘటన అనంత్ నాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక పోలీసులు చెప్పినదాని ప్రకారం వివరాల్లోకి వెళితే..


జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా అక్టోబర్ 8 నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టెర్రీటోరియల్ ఆర్మీలోని 161 యూనిట్ కు చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారిపై కాల్పులు జరపడంతో ఆ ఇద్దరిలో ఒక జవాన్ ప్రాణాలను కోల్పోయారు. మరో జవాన్ బుల్లెట్ గాయాలతో వారి చెర నుంచి ఎలాగొలాగో తప్పించుకున్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.

Also Read: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!


ఇంటలీజెన్స్ సూచన మేరకు ఆర్మీ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పలు ఏజెన్సీలతో కలిసి అనంతనాగ్, కొకెర్నాగ్ లోని కజ్వాన్ అటవీ ప్రాంతంలో మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా కూడా తనిఖీలను కంటిన్యూ చేశారు అధికారులు. ఈ క్రమంలో వారికి తమలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్ అయినట్లుగా సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన ఆర్మీ.. తనిఖీలను ముమ్మరం చేసింది. అయితే, అప్పటికి ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో వారిలో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ ఆ ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్నారు. వెంటనే ఆ ఆర్మీని అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలను ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో ఆగస్టు మొదటి వారంలో కూడా అనంత్ నాగ్ లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

Also Read: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రానికి నూతన సీఎం ఆయనేనంటా!

అంతకన్న ముందుకు కూడా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. జమ్మూకాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో నలుగురు ఆర్మీ జవాన్లు, ఒక పోలీస్ అధికారి ప్రాణాలను కోల్పోయారు.

Related News

Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..

Drugs Sale on Road: నడి రోడ్డుపై డ్రగ్స్ విక్రయం.. స్టింగ్ ఆపరేషన్ షాకింగ్ విషయాలు వెల్లడి

Nayab Singh Saini: హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీనే!

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Vinesh Phogat: సత్యమే గెలిచింది… హర్యానా ఎన్నికల్లో మాజీ రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం

PM Modi: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రానికి నూతన సీఎం ఆయనేనంటా!

Big Stories

×