EPAPER

Google Maps parking: గూగుల్ మ్యాప్స్‌లో కారు పార్కింగ్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?..

Google Maps parking: గూగుల్ మ్యాప్స్‌లో కారు పార్కింగ్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?..

Google Maps parking| గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే వాళ్లకు శుభవార్త.. ఇకపై కారు పార్కింగ్ కూడా గూగుల్స్ మ్యాప్స్ ద్వారా లభిస్తుంది. త్వరలోనే ఈ ఫీచర్ ఇండియాలో అందుబాటులో ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ ఫీచర్ ని నార్త్ అమెరికా, కెనెడా దేశాల్లో గూగుల్ కంపెనీ లాంచ్ చేసింది.


అమెరికాలో ‘స్పాట్‌హీరో’ అనే యాప్ ఈ కారు పార్కింగ్ ఆన్ లైన్ సర్వీస్ ని నిర్వహిస్తోంది. అయితే ఏప్రిల్ 2024లో గూగుల్ కంపెనీ తన గూగుల్ మ్యాప్స్ తో స్పాట్‌హీరో యాప్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. గూగుల్ మ్యాప్స్ సాఫ్ట్ వేర్ లోకి స్పాట్‌హీరో కారు పార్కింగ్ సర్వీస్ ని ఇంటిగ్రేట్ చేశారు.

ఎలా పనిచేస్తుందంటే?..
గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ సెర్చ్ ఉపయోగించే కారు డ్రైవర్లు తమ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ లోని ‘కార్ పార్కింగ్ ఆప్షన్స్’ పక్కనే ఉన్న ‘బుక్ ఆన్ లైన్’ అనే బటన్ ని నొక్కాలి. ఈ బటన్ నొక్కగానే స్పాట్‌హీరో వెబ్ సైట్ కు నావిగేట్ అవుతారు. ఆ తరువాత కార్ పార్కింగ్ ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ నగరంలో ఏ ప్రాంతంలో ఏ బిల్డింగ్ లో కారు పార్కింగ్ అందుబాటులో ఉందో చూపిస్తుంది. అదనంగా ఈవీ కారు అయితే దాని బ్యాటరీ చార్జింగ్ సౌకర్యంతో కూడిన పార్కింగ్ ఉన్న చోటు చూపిస్తుంది.


Also Read: ఇక స్మార్ట్‌ఫోన్ అవసరం ఉండదు.. ప్రపంచంలోనే తొలి ఏఐ కంటి అద్దాలు వచ్చేశాయ్!

వీటితో పాటు కారులో ఎవరికైనా వీల్ చైర్, వాలెట్ సర్వీసెస్ కావాలంటే ఆ సౌకర్యలు కూడా స్పాట్‌హీరో అందిస్తోంది. 2011 సంవత్సరం నుంచి ఆన్ లైన్ కారు పార్కింగ్ బుకింగ్ బిజినెస్ నిర్వహిస్తున్న స్పాట్‌హీరో కంపెనీకి ఇప్పటివరకు అమెరికా, కెనెడా దేశాల్లోని 300 నగరాల్లో 8000 కారు పార్కింగ్ స్థానలున్నాయి. అమెరికాలోని ప్రముఖ బిజీ ప్రాంతాలైన మాడిసన్ స్క్వేర్ గార్డెన్, చికాగో కబ్స్ లో సైతం స్పాట్‌హీరో కారు పార్కింగ్ సర్వీస్ అందిస్తోంది.

స్పాట్‌హీరో సిఈవో, వ్యవస్థాపకుడు మార్క్ లారెన్స్ మాట్లాడుతూ.. ”గూగుల్ మ్యాప్స్ తో స్పాట్‌హీరో కారు పార్కింగ్ సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేశాము. దీంతో ప్రతిరోజు మాకు మిలియన్ల సంఖ్యలో యూజర్లు వస్తున్నారు. మా కంపెనీ ఈ కారు పార్కింగ్ సర్వీసుని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. త్వరలోనే మెషీన్ లర్నింగ్, ఏఐ ఫీచర్స్ తో మరింత అడ్వాన్స్‌డ్ సర్వీస్ అందిస్తాము,” అని చెప్పారు.

అమెరికాలో స్పాట్‌హీరో యాప్ కు మిలియన్ల డౌన్ లోడ్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగించే డ్రైవర్లందరూ ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కొత్త నగరాల్లో కారు పార్కింగ్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని.. స్పాట్‌హీరో, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ తో ఈ సమస్యకు సమాధానం దొరికిందని అన్నారు.

Also Read: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

Related News

Social Media problems : సంసారంలో సోషల్ మీడియా తిప్పలు – భార్యభర్తలను విడదీస్తున్న సామాజిక మాధ్యమాలు!

Apple M4 MacBook : త్వరలోనే మరో ఆపిల్ ఈవెంట్.. మాక్ బుక్ ప్రో, మాక్ మినీ, ఐమాక్ లాంఛిగ్ ఎప్పడంటే!

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Vivo X200 Pro Mini : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

Big Stories

×