EPAPER

Manchu Vishnu : మంచు విష్ణుకు అనుకూలంగా కోర్టు తీర్పు… ఇక ట్రోలర్స్ కు చుక్కలే

Manchu Vishnu : మంచు విష్ణుకు అనుకూలంగా కోర్టు తీర్పు… ఇక ట్రోలర్స్ కు చుక్కలే

Manchu Vishnu : మా అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణుకి తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గత కొన్నాళ్ల నుంచి మంచి ఫ్యామిలీని ముఖ్యంగా మంచు విష్ణును టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్ లలో వీడియోలు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలపై తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మంచు విష్ణు కు ఆయన ఫ్యామిలీకి అనుకూలంగా ఉండడం విశేషం.


అసలు విషయంలోకి వెళ్తే…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన మంచు విష్ణు తనపై పలు యూట్యూబ్ లలో పోస్ట్ చేసిన పలు వీడియోలను తొలగించాలంటూ ఆయన కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా ఈ వివాదంపై పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆ వీడియోలను తొలగించాలంటూ కొరడా ఝుళిపించింది. ఇలా పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఆ వీడియో కంటెంట్ ను ప్రచారం చేయొద్దని, అప్రతిష్టపాలు చేసేలా వీడియోలు చేయొద్దంటూ తేల్చి చెప్పింది కోర్టు. అంతేకాకుండా మంచు విష్ణు పేరును, ఆయన వాయిస్ ని, ఫోటోలను ప్రత్యక్షంగానూ.. లేదంటే పరోక్షంగాను వాడవద్దని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఘటనలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునందుకు మంచు విష్ణుకు కోర్టు వెసులుబాటు కలిగించడం విశేషం.


కేంద్ర సమాచార శాఖకు హైకోర్టు ఆదేశాలు..

ఇక ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుపై పోస్ట్ చేసిన 10 యూట్యూబ్ లింక్స్ ను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు తాజాగా కేంద్ర సమాచార శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖను ఆదేశించింది. అంతేకాకుండా ఆయా యూట్యూబ్ ఛానల్ లకు సంబంధిత లింక్స్ ను వెంటనే రిమూవ్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సదరు ఛానల్స్ 48 గంటల్లోగా ఆ లింక్స్ ను తొలగించకపోతే తగిన చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ సంస్థను సైతం కోర్టు ఆదేశించడం గమనార్హం. ఈనెల 15న ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న వీడియోలను డిలీట్ చేయాలంటూ మంచు విష్ణు ఈ పిటిషన్ ను దాఖలు చేశాడు.

ఇక వాళ్ళకు చుక్కలే.. 

మంచు ఫ్యామిలీని, మంచు విష్ణును గత కొంతకాలంగా టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకొని మరీ వీడియోలను చేస్తున్నాయి. అందులోనూ ఫేక్ ప్రచారం ఉండడంతో మంచు విష్ణు ఎప్పటికప్పుడు విషయంపై సీరియస్ అవుతూ వచ్చారు.. ఇక ఇటీవల కాలంలో కేవలం తన ఫ్యామిలీ పైనే కాకుండా ఇండస్ట్రీలోని ఇతర నటీనటులపై అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలతో ఎవరైనా వీడియోలు చేస్తే వెంటనే వాటిని డిలీట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ‘మా’ తరఫున అలా క్లీన్ చేసిన ఛానల్స్ వివరాలను ట్విట్టర్ లో అఫీషియల్ గా పోస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతుండడంతో పలు యూట్యూబ్ ఛానళ్ళపై ఇలా పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పుడు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది కాబట్టి యూట్యూబ్ ఛానల్ లో ఎవరైనా ఆర్టిస్టులను టార్గెట్ చేస్తే వాళ్లకు చుక్కలే.

Related News

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Viswam Censor : మూవీ చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డ్… మొత్తం 14 కట్స్.. ఏ సీన్స్ కట్ చేశారంటే..?

JD Chakravarthy: చిరంజీవి.. పరమ దుర్మార్గుడు.. 8 రోజులు అలా..

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

Prabhash : రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన ప్రభాస్..!

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Big Stories

×