EPAPER

YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

YogaAsanas Help Digestion| ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామం, నిద్ర లాంటి జాగ్రత్తలు పాటించాలి. అయితే ఆధునిక జీవనశైలిలో చాలామంది వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. సమయానికి తినడం లేదు. తక్కువగా నిద్ర పోతున్నారు. ఇవన్నీ అనారోగ్యానికి దారితీస్తాయి. ముఖ్యంగా చాలామంది కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యను యోగా ద్వారా పరిష్కరించవచ్చు.


జీర్ణశక్తిని పెంచే అయిదు యోగాసానాలు ఇవే..

1. పశ్చిమోత్తనాసనం


పశ్చిమోత్తనాసనంలో శరీరాన్ని సాగదీసే విధంగా ఆసనం వేయాలి. ముఖ్యంగా వీపు, కడుపు భాగంలోని కండరాలు సాగదాయాలి. ఇలా చేస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
ముందుగా నెలగా కూర్చొని, కాళ్లు చాపాలి. వెన్నెముకగా నిటారు ఉంచి, పాదాలను సాగదీయాలి. ఆ తరువాత తలను పాదాల వైపుకు వంచాలి. మీ నడుము భాగాన్ని ముందు వైపుకు బాగా వంచండిం. మీ పాదాలు, మడమను తాకుతూ శ్వాస లోపలికి బాగా పీల్చాలి. ఆ తరువాత పీల్చిన గాలి మెల్లగా వదలాలి. ఇలా 30 సెకన్లు లేదా ఒక నిమిషం పాటు ఆసనం వేయాలి. ఆ తరువాత మెల్లగా శ్వాస వదులుతూ, పీలుస్తూ ఈ ఆసనం లో నుంచి బయటికి రావాలి.

2. పవనముక్తాసన


కడుపులో గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరంగా ఉంటే పవనముక్తాసన ఉపయోగపడుతుంది. మీ వీపుని నేలకు ఆనిస్తూ కింద పడుకోండి. రెండు కాళ్లు నిటారు చాపండి. ఆ తరువాత ముందు కుడికాలు కాస్త పైకి ఎత్తి మోకాలిని ఛాతీ భాగం వరకు తీసుకురండి. మీ రెండు చేతులతో మోకాలిని కౌగిలించుకునే విధంగా పట్టుకోండి. కడుపుకు మీ కాలు తాకుతూ ఉండాలి. ఈ ఆసనం 30 సెకండ్ల వరకు వేయండి. శ్వాస లోపలికి పీలుస్తూ.. కాసేపు తరువాత మెల్లగా వదలండి. ఆ తరువాత కుడి కాలు వదిలేసి అదే విధంగా ఎడమ కాలితో చేయండి. కాసేపు తరువాత ఎడమకాలు వదిలేసి రెండు కాళ్లు ఛాతీ భాగానికి ఆనించండి.

3. మర్జరాసన – బితిలాసన


శరీరంలో రక్తప్రసరణ, జీర్ణశక్తి పెంచేందుకు ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. మీ రెండు చేతులు, రెండు మోకాళ్ల నేలకు ఆనిస్తూ ఆవు భంగిమలో కూర్చొండి. మీ మోకాళ్లు సరిగ్గా మీ నడుము కిందకు ఉండాలి. మీ చేతులు సరిగ్గా భుజాల కిందకు ఉండాలి. ముందుగా శ్వాస పీల్చుకుంటూ మీ కడుపుని లూజ్ గా వదలండి, తలను పైకి లేపండి, నడుము భాగం కూడా పైకి ఉండాలి.

ఆ తరువాత శ్వాస మెల్లగా వదులుతూ తలను రౌండ్ గా తిప్పండి. మీ గడ్డాన్ని ఛాతి భాగం వరకు తాకనివ్వండి. ఆ తరువాత ఇవే స్టెప్స్ ని పిల్లి భంగిమ (వీపుని పైకి లేపుతూ) చేయండి. ఇలా ఆవు, పిల్ల భంగిమల్లో రెండు మూడు నిమిషాల పాటు రిపీట్ చేయండి.

4. పవిత్ర త్రికోణాసనం


పవిత్ర త్రికాణాసనం జీర్ణ క్రియను మెరుగపరిచి, కడుపు పేగుల్లోని మలినాలను డిటాక్స్ చేసేందకు ఉపయోగపడుతుంది. మీ కాళ్లను వెడల్పుగా చాపండి. మీ కుడి పాదాన్ని బయటి వైపు ఉండాలి. ఎడమ పాదం లోపలి వైపు ఉండాలి. శ్వాస మెల్లగా పీలుస్తూ.. మీ రెండు చేతులను భూమికి పారలెల్ గా చాపి శ్వాస బయటికి వదుల్తూ.. మీ కడుపు భాగాన్ని ట్విస్ట్ చేసే విధంగా మీ ఎడమ పాదాన్ని తాకండి, ఆ తరువాత మీ కుడి పాదాన్ని తాకండి.

ఆ తరువాత మీ ఎడమ చేతిని నేలపై పెట్టి, మీ కుడి చేతిని ఆకాశం వైపుకి ఎత్తండి. 30 సెకన్లపాటు శ్వాస లోపలికి తీసుకోండి, ఆ తరువాత ఎడమ చేయిని ఆకాశం వైపుకి ఎత్తి, కుడి చేయిని నేలపై పెట్టండి. 30 సెకన్ల తరువాత మెల్లగా శ్వాస వదులుతూ ఆసనం నుంచి బయటకు రండి.

5.ధునురాసన


ఈ ఆసనం కడుపు కండరాలను బలపరుస్తుంది. కడుపుని కంప్రెస్ చేస్తూ జీర్ణశక్తిని పెంచుతుంది.
ధనురాసనం వేయడానికి ముందుగా కడుపుపై నేలకు ఆనిస్తూ పడుకోండి. ఆ తరువాత వీపు వైపున కాళ్లను లేపుతూ చేతులతో పట్టుకోండి. ఆ తరువాత శ్వాస పీల్చుకుంటూ ఛాతీ భాగాన్ని భూమి నుంచి పైకి లేమి మీ కాళ్లను లాగి గట్టిగా పట్టుకోండి. ఈ ఆసనం 20 నుంచి 30 సెకన్లపాటు పట్టుకోండి. మెల్లగా శ్వాస వదులుతూ మీ కాళ్లను వదిలేయండి.

Also Read: గుండె పోటు, పక్షవాతం రాకుండా కాపాడే ఫుడ్స్ ఇవే..

ఈ ఆసనాలు నిత్యం చేస్తే.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు మంచి పరిష్కారం అందుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

Related News

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Ajwain Benefits: వాము తింటే ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

×