EPAPER

Ajwain Benefits: వాము తింటే ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

Ajwain Benefits: వాము తింటే ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

Ajwain Benefits: ప్రతి ఒక్కరి వంటగదిలో వాము సులభంగా లభిస్తుంది. ఆహారంలో ఉపయోగించే ఈ మసాలా అనేక వ్యాధులను నివారిస్తుంది. వాములో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉన్నాయి. బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వ్యక్తులకు వాము వినియోగం వారి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.


వాము ఔషధాలతో నిండి ఉంటుంది. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వినియోగం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తరుచుగా ఆహారంలో భాగంగా వామును చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందించే వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి, ఇది నొప్పి నివారిణిలా పనిచేస్తుంది. వాము వినియోగం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.


వాము వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

వాము జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతే కాకుండా వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

పెయిన్ రిలీవర్:
వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

జలుబు, దగ్గు:

జలుబు, దగ్గు గొంతు ,నొప్పిలో ఇబ్బందిపడే వారు వాము తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

జీర్ణ సమస్యలు:
కడుపులో నులిపురుగులు, మలబద్ధకం విరేచనాలు, వంటి సమస్యలను దూరం చేయడంలో వాము సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

వాము శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా అనేక రకాల వ్యాధులు రాకుండా వాము చేస్తుంది.

పీరియడ్స్ నొప్పికి ఉపశమనం:

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

వాముతో హోం రెమెడీ ఎలా తయారు చేయాలి ?

కడుపు నొప్పికి:
ఒక చెంచా వామును నీళ్లలో వేసి మరిగించి తాగడం వల్ల కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం త్వరగా లభిస్తుంది.

జలుబు, దగ్గు కోసం:

వాము, తేనె కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. దగ్గు రాకుండా చిన్న పిల్లలకు వామును ఇస్తుండటం మనం చూస్తూనే ఉంటాం.

Also Read: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

కీళ్ల నొప్పులకు:

వాము ఆయిల్‌తో కీళ్లను మసాజ్ చేయడం వల్ల నొప్పి, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.

జుట్టు కోసం:

వాము నూనెను కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. వాములోని పోషకాలు జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

పాదాలపై మంట కోసం:

వాము నీటితో తరుచుగా పాదాలను కడగడం వల్ల పాదాలలో మంట, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

×