EPAPER

TG DSC 2024: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్

TG DSC 2024: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్

TG DSC 2024: ప్రజా పాలనలో యవత కలలు క్రమంగా నెరవేరుతున్నాయి. ఎల్బీ స్టేడియం వేదికగా వేలాది మంది కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందుజేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలో ఫలితాలు వెల్లడించింది ప్రభుత్వం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యువత ఆశలు క్రమంగా నెరవేరుతున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో పోస్టులను భర్తీ చేసేందుకు చకచకా పావులు కదుపుతోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడమేకాదు, పరీక్షలు నిర్వహించిన వెంట వెంటనే అపాయింట్‌మెంట్ పత్రాలను అందజేస్తోంది. ఈ విషయంలో దూసుకుపోతోంది ప్రజా ప్రభుత్వం.

ఏడాది మార్చి ఒకటిన 11,062 టీచర్​ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది ప్రభుత్వం. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ వరకు డీఎస్సీ పరీక్షలను పూర్తి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల మంది డీఎస్సీ (DSC) పరీక్షలు రాశారు.


పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించింది. అందులో సెలక్ట్ అయిన 11, 062 మందికి నియామక పత్రాలు అందించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎల్బీ‌స్టేడియం వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ALSO READ: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్

అందులో స్కూల్ అసిస్టెంట్-2629, లాంగ్వేజ్ పండిత్- 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్- 182, సెకండ్ గ్రేడ్ టీచర్- 6508, స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్) 220, సెకండ్ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేటర్ )- 796 మంది ఉన్నారు.

ఈ ఏడాది జనవరిలో దాదాపు 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాప్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. సింగరేణిలో 441 కారుణ్య నియామకాలను భర్తీ చేసింది. ఫిబ్రవరిలో 13, 444 పోలీసు, ఫైర్, ట్రాన్స్ పోర్టు, ఎక్సైజ్, జైళ్ల శాఖల్లో పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు టీచర్ల వంతైంది. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణ యువతకు-2024 ఏడాది ఉద్యోగాల ఏడాదనే చెప్పవచ్చు.

Related News

Malla Reddy – CM Revanth: సీఎం రేవంత్‌ని కలిసిన మల్లారెడ్డి.. రాజకీయాలపై చర్చ

Revanth On Musi River: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్

Saddula Bathukamma 2024: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !

Hyderabad Metro Rail: మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

×