EPAPER

Gundeninda GudiGantalu Today Episode : శృతి మెడలో తాళికట్టిన రవి.. మీనా మెడకు చుట్టుకున్న పెళ్లి .. సత్యం అరెస్ట్..

Gundeninda GudiGantalu Today Episode : శృతి మెడలో తాళికట్టిన రవి.. మీనా మెడకు చుట్టుకున్న పెళ్లి .. సత్యం అరెస్ట్..

Gundeninda GudiGantalu Today Episode 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను రెడీ అవుతుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రవి మీనాను తీసుకొని వెళ్తాడు. మీనాను చూసిన ప్రభావతి ఎక్కడికి పెళ్లికి వెళ్తున్నట్లు ఇలా రెడీ అయ్యావు అని ప్రభావతి అడుగుతుంది. గుడికి వెళ్తున్న అత్తయ్య అంటుంది. పూలు అమ్ముకొనే మీ అమ్మను కలవడానికి వెళ్తున్నా అని చెప్పొచ్చు కదా అంటుంది. రవి తో కలిసి గుడికి వెళ్తుంది. ఇక శృతి సంజును తీసుకొని వెళ్తుంది. ఇక గిఫ్ట్స్ మర్చిపోయాను తీసుకొని వస్తావా అని సంజును పంపిస్తుంది శృతి.. ఇక రవి, శృతిలో పెళ్లి గెటప్ లో రెడీ అవుతున్నారు. కానీ సుమతి మంత్రాలూ మొదలు పెట్టండి అని టెన్షన్ పడుతుంది. దానికి శృతి ఏం కాదు అని అంటుంది. ఇక రవి ఇంకా రాలేదని మీనా లోపలికి వెళ్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా లోపలికి వెళ్లి రవిని వెతుకుతుంది.. అప్పటికే శృతి మెడలో రవి తాళి కడతాడు రవి.. అది చూసి నా మెడకు చుట్టావా అంటుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా రవి ఇంకా రాలేదు అని అనుకుంటూ పూలు కడుతుంది. రవి ఏమయ్యాడో అని అనుకుంటుంది. ఇక రవి డల్‌గా ఉండటంతో పెళ్లి ఇష్టంలేనట్లు అలా ఉన్నావేంటీ అని శ్రుతి అంటుంది. ఇంట్లోవాళ్లను కాదని చేసుకుంటున్నాం అని రవి అంటాడు. నేను కూడా అలాగే వచ్చాను కదా. ముందు కోప్పడుతారు. తర్వాత వాళ్లే సర్దుకుంటారు. ముందు ఈ క్షణాన్ని ఆస్వాదించు వంటబ్బాయి అని శ్రుతి అంటుంది. త్వరగా తాళి కట్టించండి అని సుమతి అంటే.. తంతు పూర్తి కావాలి కదా. దీవించడానికి పెళ్ళైన వాళ్లు ఎవరు లేరు కదా అని పంతులు అంటాడు. ఉన్నారు పెళ్లి అయ్యాక వస్తారు అని రవి అంటాడు. ఎవరని సుమతి అడుగుతుంది. కాసేపట్లో వస్తారు. చూడు అని శ్రుతి అంటుంది. సుమతి అందరికీ అక్షింతలు ఇస్తుంది. పెళ్లయిన వాళ్లు ఆశీర్వదించడానికి వస్తారా.. అది ఎవరబ్బా అని సుమతి ఆలోచిస్తుంది. ఇంతలో శ్రుతి ఫ్రెండ్ వచ్చి మీనా దగ్గర పూలు కొంటుంది. లోపల మా ఫ్రెండ్ పెళ్లి అని చెబుతుంది.

రవికి బాలు వీడియో కాల్ చేస్తాడు. ఏంటో బాలు వీడియో కాల్ చేస్తున్నాడని శృతితో అంటాడు. లిఫ్ట్ చెయ్యకు అని శృతి అంటుంది. మీనాకు అప్పుడే బాలు ఫోన్ చేస్తాడు.. మీనాక్షి గాజులు కొంటున్నా అని అంటాడు. అయితే నీ సైజ్ తెలియదు రవికి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. లోపల అంగ ప్రదక్షిణలు చేస్తున్నాడేమో అంటుంది. నీకు ఏ రంగులో కావాలో నాకు తెలియదు కదా.. రవి దగ్గర ఫోన్ ఉందిగా, వెళ్లి దాని నుంచి ఫోన్ చెయ్యి అంటాడు బాలు. మీనా సరే అని లోపలికి వెళ్తుంది. మీనా రవి అంటూ గుడి మొత్తం వెతుకుతుంది. సరే అని గుడి లోపలికి వెళ్తుంది మీనా. మరోవైపు తాళి ఇచ్చి మాంగళ్యధారణ కానివ్వు అని పంతులు చెబుతాడు. శృతి రవి తాళి కడుతాడు. రవి కోసం వెతుక్కుంటూ వెళ్లిన మీనా శృతి పెళ్లి చూస్తుంది. రవి, శ్రుతిని పెళ్లి పీటలపై చూసి షాక్ అవుతుంది. రవి అని గట్టిగా అరుస్తుంది.


అది విని రవి, సుమతి షాక్ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకున్నావా.. పెళ్లి అయిపోయిందా. ఏంటిది. నేను చూస్తుంది నిజమేనా అని మీనా అడుగుతుంది. నాకు ఏం చెప్పి తీసుకొచ్చావ్. నువ్ ఏం చేశావ్. శ్రుతితో మాట్లాడుతా అనేగా చెప్పావ్. నన్ను బయట నిల్చోబెట్టి నువ్ లోపల పెళ్లి చేసుకున్నావా. ఏం జరుగుతోంది అని మీనా అంటుంది. వదినా టెన్షన్ పడకు అని రవి అంటే.. ఏయ్.. ఆపు.. ఏంటీ టెన్షన్ పడొద్దా.. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అని అంటుంది. నన్ను ఇంత దారుణంగా నమ్మిస్తావా. మా అందరిని మోసం చేస్తావా. ఏ ఉద్దేశంతో ఈ పెళ్లి చేసుకున్నావ్. రాత్రి నా మాట విన్నావే. వచ్చేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా అని మీనా కోప్పడుతుంది. ఒప్పుకోరని నేనే వద్దన్నాను అని శ్రుతి అంటే.. హేయ్.. ఆపవమ్మా అని వారిస్తుంది మీనా. ఆరోజు నువ్ ఆవేశంగా వచ్చినప్పుడే మావయ్యకు చెప్పుంటే ఇక్కడికిదాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా. మధ్యలో నన్ను పిచ్చిదాన్ని చేసి పెళ్లికి ఎందుకు రప్పించారు అని అరుస్తుంది.

నన్ను మోసం చేసినందుకు నాకు బాధగా లేదు. మీ నాన్నను ఎలా మోసం చేశావయ్యా. మీ పెద్దన్నయ్య అన్ని లక్షలు తీసుకుని పారిపోయి ఆయన గుండెల్లో చిచ్చు పెట్టాడు. మీ బాలు అన్నయ్య తాగి వచ్చి గొడవ చేస్తూ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. నువ్వైనా ప్రయోజకుడివి అయి ఆయన చెప్పినట్లు వింటావని అనుకున్నాడు. నాలుగు రోజులు ఆగి ఆయనకి చెప్పి పెళ్లి చేసుకుంటే ఆయనకు ఇంత మోసం జరిగేది కాదు కదా అని మీనా అంటుంది.. ఇక మమ్మల్ని ఆశీర్వ దించండి అంటాడు రవి.. తల్లిని, తండ్రిని, అన్నయ్యను వదిలి నన్ను ఆశీర్వదించమంటున్నావా. నాకు అంత ధైర్యం లేదు. అంత గొప్ప మనసు లేదు. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్లి ఏం చెప్పాలి. మీ అన్నయ్య ఆవేశాన్ని ఎలా తట్టుకోని నిలబడాలి. నాకు గుండె దడదడలాడుతోంది. దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకున్నావ్ కదా. ఆ దేవుడినే సాక్ష్యం అడుగు. ఆశీర్వాదం అడుగు. నేను మాములు మనిషిని అని వెళ్లిపోతుంది అని మీనా వెళ్లిపోతుంటుంది. రవి ఆపుతాడు.

కొడుకు లాంటి వాడికి ఆ మాత్రం చేయలేవా. ఏ సంశయాలు పెట్టకుండా సంతకం పెట్టమ్మా. వీళ్ల కాపురం బాగుంటుంది అని పూజారి అంటుంది. దాంతో కన్నీళ్లు పెట్టుకున్న మీనా వెళ్లి సంతకం పెడుతుంది. బాలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రేయ్ సత్యం రారా బయటకు అని సురేంద్ర గొడవపడతాడు. మా ఇంటికి వచ్చి అరుస్తున్నావ్. నేను ఏం చేశాను అని సత్యం అంటాడు. ఎక్కడ నా కూతురు..అని ఇంటి మీదకీ వస్తాడు. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని ఓదార్చిన అక్షయ్.. ఆశ్రమంలో ఘనంగా అవని పుట్టినరోజు వేడుకలు..

Trinayani Serial Today October 9th: ‘త్రినయని’ సీరియల్‌: నయని ఇంటికి వచ్చిన అహల్య – భర్త గురించి ఎమోషనల్‌ అయిన అహల్య  

Nindu Noorella Saavasam Serial Today October 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చూసి భయంతో వణికిపోయిన ప్రిన్సిపాల్‌ – తనకు శక్తులు వచ్చాయని తెలుసుకున్న ఆరు

Satyabhama Today Episode: హర్ష పై నందిని ఫైర్.. క్రిష్, సత్య శోభనం .. రుద్ర ను బుక్ చేసిన సత్య..

Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకంతో రాయబారం చేసిన అపర్ణ, ఇందిరాదేవి – అనామిక సంగతి చూస్తానన్న కావ్య

Intinti Ramayanam Today Episode: ఫ్రెండ్ తో అవనిని ఘోరంగా అవమానించిన పల్లవి.. అవని తల్లి ఎవరో నిజం తెలిసిపోతుందా?

×