EPAPER

Jagan: జనంలోకి జగన్.. దూరంగా సీనియర్లు, ఎందుకు?

Jagan: జనంలోకి జగన్.. దూరంగా సీనియర్లు, ఎందుకు?

Jagan: వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? పార్టీలోని వివిధ విభాగాలకు అధ్యక్షులను నియమించడం వెనుక కారణమేంటి? పొలిటికల్ స్ట్రాటజిస్టులు ప్లాన్ అమలు చేస్తున్నారా? సీనియర్లను జగన్ దూరంగా పెట్టారా? వాళ్లే దూరంగా ఉంటున్నారా? ఇవే ప్రశ్నలు చాలామంది నేతలను వెంటాడుతున్నాయి.


జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు తర్వాత జగన్ ఆలోచన తీరు మారినట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయాక బీజేపీకి దూరంగా ఉండాలని ఆలోచన చేశారట. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీనియర్లతో మంతనాలు చేసినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఆలోచన తీరు మారిందని కొందరు నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు మొగ్గు చూపితే బెటరనే అంచనాకు జగన్ వచ్చినట్టు ఆ పార్టీ ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ఎన్నికలను చూసి ఫాలో అయ్యే కంటే పార్టీని బలోపేతం చేయాలని పొలిటికల్ స్ట్రాటజిస్టులు సలహా ఇచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు.. కంటిన్యూ అవుతోంది కూడా.


ప్రస్తుతం ఎన్నికల ముందు వరకు ఉన్న జిల్లా, ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది వైసీపీ. నేరుగా జిల్లా అధ్యక్షులనే పార్టీ బాధ్యులుగా నియమిస్తున్నా రు. ప్రస్తుతం దీనిపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో సీనియర్లు దూరంగా పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టు ఆ పార్టీ అంతర్గత సమాచారం.

ALSO READ: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

అటు సీనియర్లు.. ఇటు జూనియర్లను కాకుండా మధ్యలో ఉన్నవారిని ప్రయార్టీ ఇస్తున్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్లను నమ్ముకునే బదులు, పార్టీ కోసం కష్టపడేవారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుదనే ఆలోచనకు వచ్చారు. ఆ విధంగా నియమాకాలు మొదలుపెట్టేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల మాట.

నియమకాలు పూర్తి కాగానే, జనవరి లేదా మార్చిలో ప్రతీ జిల్లాకు వెళ్లి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. దాని తర్వాత జనంలోకి వెళ్లాలన్నది ఆయన ప్లాన్ గా చెబుతున్నారు కొంత మంది నేతలు. ఈలోగా ఒకటి లేదా రెండేళ్లు గడుస్తాయని, అప్పుడు జనంలోకి వెళ్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత.

Related News

Anchor Shyamala: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!

AP bullet train: ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఏయే ప్రాంతాల మీదుగా అంటే..

Viral News: ఆయన కొడుకు పేరు 1, 2, 6.. అనంతపురంవాసి వెరైటీ ఆలోచన, దాని అర్థం ఏమిటో తెలుసా?

New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Crime News: అత్తా, కోడలి మధ్య గొడవ.. అలా కొరికేసిందేంటీ, దెబ్బకు ఊడిపడిందిగా..

×