EPAPER

Horoscope 9 october 2024: ఈ రాశి వారికి వివాహయోగం.. ఇష్ట దేవతారాధన శుభప్రదం!

Horoscope 9 october 2024: ఈ రాశి వారికి వివాహయోగం.. ఇష్ట దేవతారాధన శుభప్రదం!

Astrology 9 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి విజయావకాశాలు ఉన్నాయి? ఏ రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఎటువంటి జాగ్రత్తలు తెలియజేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రణాళికతో ముందుకు సాగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆదిత్య హృదయం పారాయణ చదివితే శుభకరం.

వృషభం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ధ్యానంతో ఒత్తిడిని అధిగమించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావొచ్చు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.


మిథునం:
మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాంలో పూర్తవుతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. వృథా ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లాభాలు వరిస్తాయి. చేపట్టిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువులో మెరుగ్గా ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని జయించాలి. ఆవేశం, చిరాకులను దరి చేరనీయవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. శని ధ్యానం శుభదాయకం.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. జీవిత భాగస్వామితో కలహాలకు ఆస్కారం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. బంధుమిత్రులతో ఆచితూచి నడుచుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

Also Read: అక్టోబర్ 10 నుంచి ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అప్పగించిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇష్టదేవత ఆలయ సందర్శన శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సాధారంణంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనవసర విషయాల్లో దూరవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణతో ఆపదలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వరిస్తాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నతాధికారులు మీ పని విషయంలో ప్రశంసలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. సకాలంలో సాయం అందుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 నుంచి ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Grah Gochar: 3 గ్రహాల సంచారం.. వీరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయ్

Horoscope 8 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. దైవారాధన మానవద్దు!

Durga Puja 2024: మహాషష్టి పూజ ఎప్పుడు ? తేదీ, పూజకు సంబంధించిన వివరాలు ఇవే

Astrology tips on Dussehra: దసరా నాడు ఈ పనులు చేస్తే త్వరలో మీరు కూడా ‘అదానీ-అంబానీ’లు కావచ్చు

Maha Ashtami 2024: మహా అష్టమి నాడు ‘మహా సంయోగం’.. 3 రాశులకు ఆర్థిక లాభాలు

×