EPAPER

Head Massage: సెలూన్‌లో తల మసాజ్ చేసుకున్నాక స్ట్రోక్ బారిన పడిన వ్యక్తి, ఇలా ఎందుకు జరుగుతుంది?

Head Massage: సెలూన్‌లో తల మసాజ్ చేసుకున్నాక స్ట్రోక్ బారిన పడిన వ్యక్తి, ఇలా ఎందుకు జరుగుతుంది?
Head Massage: బళ్లారికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక సెలూన్ కి వెళ్ళాడు. అతను హెడ్ మసాజ్ చేయించుకున్నాడు. కాసేపటికి అతని స్ట్రోక్ బారిన పడ్డా.డు మసాజ్ చేయించుకున్న కాసేపటికి అతనిలో భరించరాని లక్షణాలు కనిపించాయి. అతను మాట్లాడలేకపోయాడు, ఎడమ వైపు ఉన్న శరీరం సరిగా సహకరించలేదు. ఇలా ఎందుకు జరిగిందో తెలియక వెంటనే వైద్య ఆసుపత్రికి వెళ్ళాడు. హెడ్ మసాజ్ చేయించుకుంటున్నప్పుడు మెడను బలవంతంగా తిప్పడం వల్ల స్ట్రోక్ కు గురైనట్టు భావిస్తున్నారు వైద్యులు.
మెడపై ఒత్తిడి
మెడను బలంగా హఠాత్తుగా తిప్పడం అనేది మెడలోని ధమనులు దెబ్బ తినడానికి కారణం అవుతుంది. దీనివల్ల ఇలాంటి స్ట్రోక్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెడ్ మసాజ్ చేసినప్పుడే కాదు. షాంపూ చేసేటప్పుడు కూడా అతిగా మెడపైన ఒత్తిడి పడకూడదు. అలా పడినా కూడా స్ట్రోక్ వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. మెడను విపరీతంగా సాగదీయడం వంటివి కూడా చేయకూడదు. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, గుండె జబ్బులు ఉన్నవారు ఇలా మెడ పై అధిక ఒత్తిడిని కలగజేస్తే వారి ధమనులు దెబ్బ తినడం, అక్కడ రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ రావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు వైద్యులు.
మసాజ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన బలంతో నొక్కుతూ ఉంటారు. అది మెడ భాగంలో గాయానికి  కారణం కావచ్చు. కాబట్టి మసాజ్‌లు వంటివి చేయించుకుంటే లైసెన్స్ పొందిన థెరపిస్టుల వద్ద చేయించుకోవాలి. ఎవరు పడితే వారి దగ్గర చేయించుకుంటే కష్టాలు తప్పవు.
మసాజ్ ఎలా చేయించుకోవాలి?
మీరు మసాజ్ చేయించుకోవాలనుకుంటే సున్నితమైన పద్ధతులను పాటించే అనుభవజ్ఞులైన, లైసెన్సు పొందిన థెరపిస్టులను కలవండి. అలాగే మెడను అతిగా లాగడం లేదా మెడపై తీవ్రంగా ఒత్తిడి వంటివి పెంచడం చేస్తే వెంటనే వద్దని చెప్పండి. మెడకు సపోర్టుగా ఏదైనా మెత్తని దిండును పెట్టమని చెప్పండి. మీకు మసాజ్ చేస్తున్నప్పుడు మెడ భాగంలో అసౌకర్యం లేదా నొప్పి అనిపిస్తే వెంటనే ఆ మసాజ్ ను ఆపమని చెప్పండి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు ఉన్నవారు ఇలాంటి మసాజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల మసాజ్ చేస్తున్నప్పుడు మెడ భాగంలోని ధమని దెబ్బ తినే ప్రమాదం ఎక్కువ.
స్ట్రోక్ వస్తే ఎలా గుర్తించాలి?
స్ట్రోక్ లక్షణాలను తెలియక కొంతమంది ఇంటి వద్ద ఉండిపోతారు. ముఖంలో ఒకవైపు భాగం చచ్చుబడినట్లు అవుతుంది. చేతులను పైకి లేపలేరు. మాట్లాడుతున్నప్పుడు అస్పష్టంగా అనిపిస్తుంది. మీ శరీరం మీ అదుపులో ఉన్నట్టు ఉండదు. మైకం, వికారం కమ్ముతాయి. చూపు కూడా అస్పష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు వెంటనే వైద్య సహాయాన్ని అందుకోవాలి. లేకుంటే ఒక్కోసారి తీవ్ర అనారోగ్యాలుగా మారే అవకాశం ఉంది.


Related News

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

Mental Health: ఆ వ్యాధి ఉన్న వారిలో చెవిలో రకరకాల గుసగుసలు ఎందుకు వినిపిస్తాయి?

Rava Kesari: రవ్వ కేసరి మిక్స్‌ను ఇలా తయారుచేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు

Obesity Causes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

NTR: తారక్‌ ఒక మంచి తండ్రి కూడా.. పిల్లల పెంపకంపై ఎన్టీఆర్ చెప్పిన టిప్స్ ఇవే, అదుర్స్ అంతే!

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

×