EPAPER

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల

YSRCP leader Anchor shyamala shocking comments: ఏపీలో కూటమి పాలనపై వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ‘జానీ’లు ఎక్కువయ్యారని ఆరోపించారు. మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఓ మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారని వైసీపీ నేత, యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ నన్ను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచి ఇవి మొదలయ్యాయన్నారు. అసభ్య సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారన్నారు. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారన్నారు.

అలాగే, పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారని, బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా స్పందించ‌లేదని, ముందే స్పందించి ఉంటే ఆ పాప బతికేదన్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారని ఆడపిల్లలు వాపోతే పట్టించుకోలేదని, పైగా సెలవులు ఇచ్చి అందరినీ పంపేశారన్నారు.


జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితే లేదన్నారు. నన్ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయన్నారు. దారుణంగా నా గురించి పోస్టులు పెట్టారని, టీడీపీ అఫీషియల్ గ్రూపులో పోస్టులు పెట్టారన్నారు.

సినీ పరిశ్రమ నుంచి వస్తే అంత అలుసుగా ఎందుకు చూస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాలేదా? అన్నారు. టీడీపీలో జయప్రద లాంటి మహిళలు పనిచేయలేదా? వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అసలైన మహిళా శక్తి ఏంటో త్వరలోనే చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

రాజకీయాల్లో మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తారా?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. దసరా పండుగ మహిళా శక్తికి నిదర్శనమని, కానీ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు.

Related News

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Crime News: అత్తా, కోడలి మధ్య గొడవ.. అలా కొరికేసిందేంటీ, దెబ్బకు ఊడిపడిందిగా..

Chandrababu: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

AP BJP: రాహుల్ కు స్వీట్స్ పంపిన ఏపీ బీజేపీ నేతలు.. కారణం ఇదే

Tirumala: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

×