EPAPER

AP BJP: రాహుల్ కు స్వీట్స్ పంపిన ఏపీ బీజేపీ నేతలు.. కారణం ఇదే

AP BJP: రాహుల్ కు స్వీట్స్ పంపిన ఏపీ బీజేపీ నేతలు.. కారణం ఇదే

CONGRESS vs BJP: హర్యానా ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది బీజేపీ. బీజేపీ నేతల ఆనందానికి అవధుల్లేవు. దీనికి కారణం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు కావడమే. అయితే ఇక్కడ గెలిచింది బీజేపీ.. స్వీట్స్ వస్తోంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి. అందులో కూడా ఓన్లీ జిలేబీ మిఠాయిలు మాత్రమే వస్తున్నాయి. అసలు ఈ జిలేబీ వెనుక ఉన్న కథ ఏంటంటే..


హర్యానా ఎన్నికల హోరు.. హోరాహోరీగా సాగింది. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ విశ్వప్రయత్నం చేశారు. రెండు పార్టీల పెద్దలు గ్రామగ్రామాన పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఇప్పటి వరకు రెండు పర్యాయాలు అధికారంలో గల బీజేపీ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాల్సిందే అంటూ ప్రచారపర్వాన్ని సాగించింది. ఇక్కడ ఎన్నికల ప్రచారానికై రాహుల్ గాంధీ గోహనా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భారీ బహిరంగ సభలో సైతం రాహుల్ పాల్గొన్నారు.

ఈ సభలో స్థానిక నేత దీపేందర్‌ సింగ్‌ హూడా జిలేబీ తీసుకొని రాహుల్ కి తినిపించారు. ఆ జిలేబీ తిన్న రాహుల్ అతి మధురంగా ఉందని, ఇది విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చని తెలిపారు. ఇక్కడి జిలేబీ తయారు చేసే సంస్థలను ప్రోత్సహిస్తే.. ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని రాహుల్ అన్నారు. ఇలా జిలేబీ కూడా ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యతను పొందింది. అనంతరం ఎన్నికల హడావుడి రానే వచ్చింది. ఎన్నికలను సైతం ఈసీ పకడ్బందీగా నిర్వహించింది. ఆ తర్వాత ఎన్నికలు ముగిశాయి.. ఇక ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.


ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇక కాంగ్రెస్ గెలుపు ఖాయమని భావించారు అందరూ. దీనికి కారణం అధిక సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే విజయావకాశాలు అధికమని ప్రకటించాయి. ఈ అంచనాతో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు కూడా పంచుకున్నారు. నేడు ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఫలితాలు తారుమారయ్యాయి.

బీజేపీ 48 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి.. హ్యాట్రిక్ కొట్టింది. ఇంకేముంది ప్రచారంలో జిలేబీ తిన్న రాహుల్ కు బీజేపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. హర్యానాలో బీజేపీ గెలుపును ఆకాంక్షిస్తూ బీజేపీ నేతలు జిలేబీలను రాహుల్ కు కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ఒక రాష్ట్రం నుండి కాదు.. ఏకంగా అన్ని రాష్ట్రాల నుండి జిలేబీలను కొరియర్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

Also Read: Haryana Election Results 2024: హర్యానాలో బీజేపీ హవా.. అంతా ఆమ్ ఆద్మి దయేనా? అంచనాలన్నీ తారుమారు!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్వర్యంలో ఏపీ నుండి కూడా రాహుల్ కు బీజేపీ నేతలు జిలేబీలను కొరియర్ ద్వారా పంపించారు. తమ పార్టీ ట్విట్టర్ ఖాతాలో బిల్, వివరాలను పోస్ట్ చేశారు. అయితే బీజేపీ రివర్స్ అటాక్ చేయడంపై కాంగ్రెస్ నుండి విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక్కడ జిలేబీలు పంపి రాహుల్ ను అవమానించడం లేదని, వాటి తయారీ రంగంలో రాణిస్తున్న కార్మికులను అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు.

Related News

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Crime News: అత్తా, కోడలి మధ్య గొడవ.. అలా కొరికేసిందేంటీ, దెబ్బకు ఊడిపడిందిగా..

Chandrababu: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

Tirumala: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

×