EPAPER

Guidelines GO: ‘ఇది దేశ చరిత్రలోనే ప్రథమం’

Guidelines GO: ‘ఇది దేశ చరిత్రలోనే ప్రథమం’

Minister Ponnam Prabhakar Comments: గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా. బీఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావ్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ఉన్నారు. గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియాచెల్లింపునకు ప్రభుత్వం రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించిందని, జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Also Read: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

అనంతరం టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందంటూ ఆయన అభినందనలు తెలిపారు. మంత్రి పొన్నం చొరవ తీసుకుని గల్ఫ్ సంక్షేమ జీవోల విడుదలకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు అనేది ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశ చరిత్రలోనే ప్రథమం అని ఆయన ప్రభుత్వాన్ని కొనియాడారు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మృతి చెందిన గల్ఫ్ కార్మికుల వారసులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేరుకోవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి గల్ఫ్ సంఘాలు, గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జేఏసీ పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: రాష్ట్ర ప‌ర్యాట‌కంపై అమెరికాలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం.. ప్రశంసల పరంపర

టీపీసీసీ ఎన్నారై సెల్ బృందం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ – ఎన్నారై) ప్రభుత్వ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు, జీఏడీ ఎన్నారై ప్రొటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ డా. ఎస్. హరీష్, ఎన్నారై అధికారులు బీబీఆర్ కార్తీక్, ఇ. చిట్టిబాబు, రూపలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలిపారు.

Related News

Telangana Free Bus Effect: బస్సులల్లో కొట్టుకుంటున్న మహిళలు… ఇది ప్రభుత్వం తప్పా…?

Kishan Reddy: జమ్మూలో ఎక్కువ సీట్లు సాధించాం.. ప్రజల విశ్వాసం మాపైనే.. కిషన్ రెడ్డి

Raj Pakala: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..

Centers: వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారా…? అయితే ఈ శుభవార్త మీ కోసమే…

Jagadish Reddy: భట్టి విక్రమార్క బహిరంగ చర్చకు సిద్ధమా..? జగదీశ్ రెడ్డి సవాల్

×