EPAPER

Cinnamon Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌‌తో ముఖంపై మొటిమలు మాయం

Cinnamon Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌‌తో ముఖంపై మొటిమలు మాయం

Cinnamon Face Pack: దాల్చిన చెక్క వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది. దాల్చిన చెక్క శరీరానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మొటిమల సమస్యను తొలగించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటియలు ఉన్న చోట దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా దాల్చిన చెక్కతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది.


దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క వల్ల కలిగే ప్రయోజనాలు, ఫేస్ ప్యాక్‌లను తయారుచేసే విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చినచెక్క యొక్క ప్రయోజనాలు:
మొటిమలను తగ్గిస్తుంది: దాల్చినచెక్కలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతాయి. అంతే కాకుండా ముఖంపై మంటను తగ్గిస్తాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: దాల్చినచెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.
రక్త ప్రసరణను పెంచుతుంది: దాల్చిన చెక్క రక్త ప్రసరణను పెంచడం ద్వారా చర్మానికి పోషణను అందిస్తుంది.
ముడతలను తగ్గిస్తుంది: దాల్చినచెక్కలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి ముడతలను తగ్గించి, చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి.
చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది: దాల్చిన చెక్క చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ముఖంపై జిడ్డను కూడా తొలగిస్తుంది.


దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్‌లు తయారు చేసే విధానం:

1. దాల్చిన చెక్క, తేనె ఫేస్ ప్యాక్:

కావలసినవి:
దాల్చిన చెక్క పొడి -2 టీస్పూన్
తేనె -2 టీస్పూన్ల
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో దాల్చిన చెక్క పొడితో పాటు, తేనెను ఒక బౌల్ లో వేసి మాక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15- 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

2. దాల్చిన చెక్క, పెరుగుతో ఫేస్ ప్యాక్:

కావలసినవి:
దాల్చిన చెక్క పొడి -1 టీస్పూన్
పెరుగు -2 టీస్పూన్ల

తయారీ విధానం: ముందుగా పైన చెప్పిన మోతాదుల్లో దాల్చిన చెక్క, పెరుగులను ఒక బౌల్ లో వేసి మీక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్టును ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను కడిగేయాలి.

Also Read: పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పక్కా !

3. దాల్చిన చెక్క, నిమ్మ రసంతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
దాల్చిన చెక్క పొడి -1 టీస్పూన్
నిమ్మరసం -1 టీస్పూన్

తయారీ విధానం: ముందుగా పైన చెప్పిన మోతాదుల్లో దాల్చిన చెక్క పొడితో పాటు నిమ్మరసం లను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేయాలి. అనంతరం 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Obesity Causes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

NTR: తారక్‌ ఒక మంచి తండ్రి కూడా.. పిల్లల పెంపకంపై ఎన్టీఆర్ చెప్పిన టిప్స్ ఇవే, అదుర్స్ అంతే!

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Hair Loss: జుట్టు రాలుతోందని బాధ పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Best Face Mask: పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Anti Aging Foods: వయస్సు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలా ? అయితే ఇవి తినండి

×